24, జనవరి 2013, గురువారం

మాగనూరు మండలము (Maganur Mandal)

జిల్లా నారాయణపేట
రెవెన్యూ డివిజన్ నారాయణపేట
జనాభా47163 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంమక్తల్
లోకసభ నియోజకవర్గంమహబూబ్ నగర్
పర్యాటక ప్రాంతాలుకృష్ణ

ముఖ్య పంటలు
కందులు
మండల ప్రముఖులుజైనమతగురువు సురీశ్వర్ జీ
మాగనూరు నారాయణపేట జిల్లాకు చెందిన మండలం. ఇది జిల్లాలో పశ్చిమ వైపున కర్ణాటక సరిహద్దులో ఉంది.  హైదరాబాదు-రాయచూరు అంతర్రాష్ట్ర రహదారి మరియు వాడి-గుంతకల్లు రైలుమార్గం మండలం నుంచి వెళ్ళుచున్నాయి. ప్రతిపాదనలో ఉన్న వికారాబాదు-కృష్ణా మార్గం మండలం నుంచి వెళుతుంది. మాగనూరు మండలంలో శేషాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ మండలము నారాయణపేట రెవెన్యూ డివిజన్, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47163. ఇది జిల్లాలోనే కాకుండా తెలంగాణలోనే అతి పశ్చిమాన ఉన్న మండలము. కృష్ణానది రాష్ట్రంలో ప్రవేశించే తంగడి గ్రామం ఈ మండలంలోనిదే. భీమానది ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించే ఏకైక మండలం ఇదే. జైనమతగురువు విజయరాజ్ తిలక్ సురీశ్వర్ జీ (సాయిబన్న) ఈ మండలమునకు చెందినవారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న ఈ మండలం కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో కలిసింది.

మండల సరిహద్దులు:
ఈ మండలము త్రికోణం ఆకారంలో ఉంది. తూర్పున మక్తల్ మండలము సరిహద్దుగా ఉండగా మిగితా అన్నివైపులా కర్ణాటక రాష్ట్రం సరిహద్దుగా ఉన్నది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 41820. ఇందులో పురుషులు 20964, మహిళలు 20856.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47163. ఇందులో పురుషులు 23503, మహిళలు 23600. జనాభాలో ఇది జిల్లాలో 54వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
హైదరాబాదు-రాయచూరు అంతర్రాష్ట్ర రహదారి మండలం నుంచి వెళ్ళుచున్నది. వాడి-గుంతకల్లు రైలుమార్గం కూడా మండలం నుంచి వెళ్ళుచున్నది. కృష్ణా వద్ద రైల్వేస్టేషన్ ఉంది. వాడి-గుంతకల్ మార్గంలో జిల్లాలో ఉన్న ఏకైక రైల్వేస్టేషన్ ఇదే.

మక్తల్ నియోజకవర్గంలో
మాగనూరు మండల స్థానం (ఎరుపు రంగు)
మండల రాజకీయాలు:
మాగనూరు మండలం మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగము. 2006లో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో 12 స్థానాలకు గాను తెలుగుదేశం 5, కాంగ్రెస్ పార్టీ 4, భాజపా 2, తెరాస 1 స్థానాలలో విజయం సాధించాయి. భాజపా, తెరాస మద్దతుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి ఎంపీపీగా ఎన్నికయ్యారు. మారిన పరిస్థితుల కారణంగా భాజపా, తెలుగుదేశం పెట్టిన అవిశ్వాసంతో 2010 ఆగస్టు 23న పదవి పోయింది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎల్ల లింగమ్మ విజయం సాధించారు.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 33 ప్రాథమిక పాఠశాలలు (అన్నీ మండల పరిషత్తు), 10 ప్రాథమికోన్నత పాఠశాలలు (7 మండల పరిషత్తు, 3 ప్రైవేట్), 8 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 7 జడ్పీ), 1 ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 35235 హెక్టార్లలో 47% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట కందులు. పెసర్లు, వరి, వేరుశనగ, ప్రత్తి కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 532 మిమీ. మండలంలో సుమారు 2900 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.


కాలరేఖ:
  • 2013 ఏప్రిల్ 3: ఫ్రాన్సుకు చెందిన చరిత్ర పరిశోధకులు సెర్జ్, క్రిస్టినాలు మడుమాల్ సందర్శించి నిలువురాళ్ళను పరిశీలించారు.

మాగనూరు మండలంలోని గ్రామపంచాయతీలు
 

ఇవి కూడా చూడండి:


హోం,
విభాగాలు:
నారాయణపేట జిల్లా మండలాలు,  మాగనూరు మండలము, నారాయణపేట రెవెన్యూ డివిజన్, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం, 
  • https://narayanpet.telangana.gov.in/ (Narayanapet Dist official website)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక