రాష్ట్రంలోనే పలు ప్రత్యేకతలకు పేరుగాంచిన రంగారెడ్డి జిల్లా ఆగస్టు 15, 1978న ఏర్పడింది. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హైదరాబాదు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి 37 మండలాలతో ఈ జిల్లాను ఏర్పాటుచేశారు. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ జిల్లా పలుమార్పులకు లోనైంది. జిల్లా పశ్చిమభాగం వికారాబాదులో జిల్లాలో, ఈశాన్య భాగం మేడ్చల్ జిల్లాలో భాగంకాగా, మహబూబ్‌నగర్ జిల్లాలోని 7 (కొత్తవి కలిపి 10) మండలాలు కలిపి మొత్తం 27 మండలాలు ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, తెలంగాణ పితామహుడిగా కీర్తిగడించిన ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండా వెంకట రంగారెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ జిల్లాకు చెందినవారే. శ్రీరామునిచే ప్రతిష్టించబడిన కీసర లింగేశ్వరాలయం, అనంతగిరి లాంటి పర్యాటకక్షేత్రాలు, చిలుకూరు బాలాజీ, కీసర లాంటి పుణ్యక్షేత్రాలు ఈ జిల్లాలోనివే. జిల్లాలో 27 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఈ జిల్లాలో ప్రవహించే ప్రధాన నది మూసీ జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 24,46,265. జిల్లాల పునర్వువస్థీకరణకు ముందు ఈ జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా ఉండేది. చరిత్ర: నిజాం కాలంలో ఈ ప్రాంతం అత్రాప్-ఎ-బల్ద్ జిల్లాలో భాగంగా గుల్షనాబాదు సుభాలో ఉండేది. 1948లో నిజాం నిరంకుశ పాలన అంతం తర్వాత హైదరాబాదు రాష్ట్రంలో హైదరాబాదు జిల్లాలో భాగంగా ఉండింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కూడా 1978 వరకు హైదరాబాదు జిల్లాలోనే కొనసాగింది. ఆగస్టు 15, 1978న హైదరాబాదు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి కె.వి.రంగారెడ్డి పేరిట ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. తర్వాత జిల్లాపేరు లోచి కె.వి.పదాలను తొలిగించారు. ఏర్పాటు సమయంలో రంగారెడ్డి జిల్లాలో 11 తాలుకాలు ఉండగా 1986లో మండలాల వ్యవస్థ ప్రారంభం కావడంతో తాలుకాల స్థానంలో 37 మండలాలు ఏర్పడ్డాయి. అక్టోబరు 11, 2016 నాటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం 27 మండలాలు ఉన్నాయి. నిజాం విమోచనోద్యమం: 1947 ఆగస్టు 15న దేశమంతటా ప్రజలు స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటుండగా హైదరాబాదు సంస్థాన ప్రజలు మాత్రం దాష్టీక రజాకార్ల రాక్షస దురాగతాలకు బలైపోతున్నారు. ఈ సమయంలో అప్పటి అత్రాఫ్-ఎ-బల్దా జిల్లాలో భాగమైన ఇప్పటి రంగారెడ్డి జిల్లా ప్రాంతం ప్రజలు కూడా నిజాం మరియు రజాకార్ల బాధలను పడలేక ప్రజలు ఎదురు తిరిగారు. మందుముల నర్సింగరావు, కాటం లక్ష్మీనారాయణ, గంగారం లాంటి ఉద్యమకారులు ప్రజలను చైతన్యవంతం చేశారు. శంషాబాదు ప్రాంతానికి చెందిన గంగారం నారాయణరావు పవార్ తో కలిసి నిజాం నవాబునే హత్యచేయడానికి వ్యూహంపన్నారు. శంషాబాదుకే చెందిన గండయ్య హిందువులను నీచంగా చూడడం భరించలేక పోరాటాన్ని ఉధృతం చేశారు. అతన్ని అరెస్టు చేసి జైల్లోవేసిన పిదప క్షమాపణలు చెబితే వదిలివేస్తామని నచ్చజెప్పిననూ ఆయన అందుకు నిరాకరించారు. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు పోరాటయోధులకు పెట్టనికోటలాంటివి. ఇప్పటి రంగారెడ్డి-నల్గొండ జిల్లా సరిహద్దులో ఉన్న రాచకొండ గుట్టలను పోరాటయోధులు సమర్థంగా వినియోగించుకున్నారు. పరిశ్రమలు: వాయుమార్గం: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రంగారెడ్డీ జిల్లాకు చెందిన శంషాబాదు మండలంలో ఉంది. రాష్ట్ర రాజధానికి 22 కిమీ దూరంగా ఉన్న ఈ విమానాశ్రయాన్ని 2008లో ప్రారంభించారు. రాజకీయాలు:
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
23, ఆగస్టు 2013, శుక్రవారం
రంగారెడ్డి జిల్లా (Ranga Reddy Dist)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి