2, ఏప్రిల్ 2013, మంగళవారం

పిల్లలమర్రి వృక్షం (Pillalamarri Tree)

పిల్లల మర్రి వృక్షం
మహబూబ్ నగర్ జిల్లా చిహ్నమైన పిల్లల మర్రి వృక్షం మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకపెద్ద మర్రి చెట్టు. అనేక దూర ప్రాంతాలనుంచి ఈ మహావృక్షాన్ని చూడడానికి సందర్శకులు తరలివస్తుంటారు. ముఖ్యంగా డిసెంబర్, జనవరి మాసాలలో పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి మహా వృక్షాన్ని సందర్శిస్తారు. స్థానిక పట్టణవాసులకైతే ప్రతి ఆదివారం ఇక్కడ పండుగే. మర్రిచెట్టు ఎదురుగా పురావస్తు మ్యూజియం, పిల్లల కోసం ఆటస్థలం, సమీపంలోనే జింకలపార్కు, కొత్తగా ఏర్పాటుచేసిన జిల్లా సైన్స్ మ్యూజియం, ఆక్వేరియం, మినీ జూపార్కు ఉన్నాయి.

మహా వృక్షం
పిల్లలమర్రి ఒక మహా మర్రివృక్షం. 700 సంవత్సరాల గతానుభవాల్ని మౌనంగా వీక్షించిన ఈ ఘన వృక్షం పిల్లలమర్రికి ప్రత్యేకతను సాధించి పెట్టింది. ఇన్ని శతాబ్దాల వయసున్న పిల్లలమర్రిని చూడడం నిజంగానే అద్బుత అనుభవం. మహబూబ్ నగర్ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రిని వందల సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడి ఇది మహావృక్షమైంది. ఈ చెట్టు యొక్క ప్రధాన కాండం ఎక్కడుందో చెప్పడం కష్టం. దీని పుట్టుకకు సంబంధించిన ఆధారాలు కూడా లేవు.

పిల్లలమర్రి వద్ద పురాతనమైన విగ్రహాలు
మ్యూజియం
పిల్లల మర్రి మ్యూజియాన్ని 1976 లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో లభ్యమైన కమనీయ శిల్పాలను పురావస్తుశాఖ మ్యూజియంలో ఉంచారు. వివిధ పురాతన కాలాల్లో పరిణామం చెందిన శిల్ప శైలిని, అప్పటి మానవులు ఉపయోగించిన వస్తు సామాగ్రిని ఈ మ్యూజియం లో పొందుపర్చినారు. క్రీ.శ.7 వ శతాబ్ది నుంచి 15 వ శతాబ్ది శిల్ప పరిణతిని చాటే అపురూప శిల్పాలున్నాయి. హిందూ, బౌద్ధ, జైన మత ధోరణులకు అద్దం పట్టే అనేక శిల్పాలున్నాయి. రెండు వేల సంవత్సరాల కాలం నాటి మద్య రాతి యుగానికి చెందిన శిథిలమైన వస్తువులు షోకేసుల్లో భద్రపర్చినారు. చాళుక్యుల కాలం నుంచి విజయనగర కాలం నాటి వరకు రూపుదిద్దుకున్న అనేక శిల్పాలున్నాయి.

ఆటస్థలం, జింకల పార్కు, మినీ జూ
విహార యాత్రకు వచ్చే వారి కోసం ఇక్కడ మినీ జూ పార్కు ఉంది. రకరకాల పక్షులు, నెమళ్ళు, కుందేళ్ళు, కోతులు మున్నగునవే కాకుండా, చేపల అక్వేరియం కూడా పర్యాటకులను ఆకట్టుకొంటున్నది. పిల్లల కోసం ఆటస్థలం ఉంది. ఇక్కడే జింకల పార్కు కూడా ఉంది. పురావస్తుశాఖ, అటవీశాఖాధికారులు పిల్లలమర్రిని 1976లో తమ శాఖల పరిధిలోకి తీసుకున్నారు. పురావస్తుశాఖచే మ్యూజియం ఏర్పాటుచేయించారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటిముంపు కారణంగా కృష్ణా నది తీరంలోని ఈర్లదిన్నె గ్రామం నీటమునగగా, 1981లో అక్కడి నుంచి రాజరాజేశ్వరీ మాత ఆలయంలోని విగ్రహాన్ని పిల్లలమర్రికి తీసుకువచ్చారు. ఇక్కడ పాలరాతితో దేవాలయాన్ని నిర్మించి 1983లో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ప్రతిష్టింపచేశారు.

జిల్లా సైన్స్ మ్యూజియం
ఇదివరకు ఆర్డీవో కార్యాలయం వద్ద ఉన్న జిల్లా సైన్స్ మ్యూజియంను పిల్లలమర్రి సమీపంలో తరలించారు. దీనితో పిలలమర్రి సందర్శించడానికి వచ్చే పర్యాటకులకు ఇది అదనపు విజ్ఞాన సందర్శనకు వీలు కలిగిస్తుంది. హైస్కూలు మరియు కళాశాల విద్యార్థులకేకాకుండా విజ్ఞానాన్ని సమకూర్చుకొనే ఔత్సాహికులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంది.

విభాగాలు: పాలమూరు జిల్లా పర్యాటక ప్రదేశాలు,  మహబూబ్‌నగర్ మండలము,  మహబూబ్‌నగర్ పట్టణం,  

= = = = =

3 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. అవునండి, అది ఘనత కలిగిన ఘణపురం. మా వద్ద సమాచారం కూడా ఉన్ననూ ఇక్కడ చేర్చుటకు సమయం లభించడం లేదు. చేర్చడానికి ప్రయత్నిస్తాం.

      తొలగించండి
  2. This fort is located about 26 Kms away from Mahaboob Nagar District head quarters. This is a hill fort and was built by joining to mountains by Kakathiya King Gona Ganapa Reddy during the Year A.D. 1224. The King is Son of the famous Ranganatha Ramayana Writer Sri Gona Budda Reddy. The name of Ghanapuram Killa came into existence from the name of Kakatiya Ruler Sri Ganapathi Deva.

    In Side the Temple you can see Veerabhadraeswarea Alayam, NarsimhaswamyTemple and ChowdeswariTemple. To protect from enemies the cannons have kept on the upper side of the fort. Inside the fort one can see King's Palace and Ministers Houses. People believe that there are two secret tunnels inside of the fort. One is connected with the village in the bottom of the mountain and another one is connected with the Panagal fort. Historically this is a very important Fort. This fort has witnessed many wars between Bahamanis, Vijayanagara Kings, Bijapur Kings and Qutb Shahi Kings etc.

    రిప్లయితొలగించండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక