24, జనవరి 2013, గురువారం

మక్తల్ మండలము (Makthal Mandal)

జిల్లా నారాయణపేట
రెవెన్యూ డివిజన్నారాయణపేట
జనాభా62205 (2001)
71976 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంమక్తల్
లోకసభ నియోజకవర్గంమహబూబ్‌నగర్
పర్యాటక ప్రాంతాలు
ముఖ్య పంటలుకందులు
మండల ప్రముఖులు
మక్తల్ నారాయణపేట జిల్లాకు చెందిన మండలము. హైదరాబాదు నుంచి రాయచూరు వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. ప్రతిపాదనలో ఉన్న కృష్ణా - వికారాబాదు రైల్వేమార్గం మండలం నుంచి వెళ్తుంది. ఈ మండలం మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్  లోకసభ నియోజకవర్గం, నారాయణపేట రెవెన్యూ డివిజన్ లో భాగంగా ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 71976. మండలంలో సంగంబండ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. పస్పుల ఎత్తిపోతల పథకాన్ని కూడా మండలంలో ఏర్పాటుచేస్తున్నారు. మండలంలో 39 రెవెన్యూ గ్రామాలు, 26 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మండల కేంద్రం చాలా ప్రాచీనమైన గ్రామము. కాకతీయ కాలంలో మగతల పేరుతో పెద్ద పట్టణంగా వైభవంగా వెలుగొందినది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న ఈ మండలం కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో కలిసింది.

సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున ఉట్కూరు మండలము, తూర్పున నర్వ మండలము, దక్షిణమున ధరూర్ మండలము మరియు కర్ణాటక రాష్ట్రము, పశ్చిమాన మాగనూరు మండలము సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 62205. ఇందులో పురుషులు 31134, మహిళలు 31071.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 71976. ఇందులో పురుషులు 36167, మహిళలు 35809. జనాభాలో ఇది జిల్లాలో 12వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
హైదరాబాదు- రాయచూరు అంతర్రాష్ట్ర రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మక్తల్ నుంచి నారాయణపేట, ఆత్మకూరు పట్టణాలకు కూడా రహదారి సౌకర్యం ఉంది.ప్రతిపాదిత దేవరకద్ర-రాయచూరు రైల్వేలైన్ మండలం నుంచి వెళుతుంది.

చరిత్ర:
చరిత్రలో మగతలగా పిలువబడ్డ మండలకేంద్రం ఒకప్పుడు పెద్ద వ్యాపారకేంద్రంగా వర్థిల్లినది. కాకతీయుల కాలంలో పేరుపొందిన కొన్ని వర్తకకేంద్రాలలో ఇది ఒకటి. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న ఈ మండలం కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో కలిసింది.

రాజకీయాలు:
ఈ మండలము మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మారెడ్డి ఎన్నికయ్యారు.

మక్తల్ నియోజకవర్గంలో
మక్తల్ మండల స్థానం (పసుపు రంగు)
విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 44 ప్రాథమిక పాఠశాలలు (36 మండల పరిషత్తు, 8 ప్రైవేట్), 22 ప్రాథమికోన్నత పాఠశాలలు (14 మండల పరిషత్తు, 8 ప్రైవేట్), 16 ఉన్నత పాఠశాలలు (2 ప్రభుత్వ, 6 జడ్పీ, 8 ప్రైవేట్), 2 జూనియర్ కళాశాలలు (1ప్రభుత్వ, 1 ప్రైవేట్) ఉన్నవి.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 35101 హెక్టార్లలో 50% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట కందులు. వరి, పెసర్లు, ప్రత్తి, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 528 మిమీ. మండలంలో సుమారు 2700 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

మక్తల్ మండలంలోని గ్రామపంచాయతీలు
 

ఇవి కూడా చూడండి:


హోం,
విభాగాలు:
నారాయణపేట జిల్లా మండలాలు,  మక్తల్ మండలము, నారాయణపేట రెవెన్యూ డివిజన్, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం, 
  • https://narayanpet.telangana.gov.in/ (Narayanapet Dist official website)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక