నారాయణపేట జిల్లా, తెలంగాణలోని జిల్లాలలో ఒకటి. 2019 ఫిబ్రవరి 16న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు ప్రకారం ఈ జిల్లా కొత్తగా అవతరించింది. (ఫిబ్రవరి 17, 2019 నుంచి జిల్లా పాలన అమలులోకి వస్తుంది) జిల్లాలో 11 మండలాలు, 1 రెవెన్యూ డివిజన్ ఉన్నాయి. తెలంగాణలోనే ప్రాచీన సంస్థానాలలో ఒకటైన లోకపల్లి సంస్థానకేంద్రంగా వర్థిల్లిన నారాయణపేట పట్టణం కొత్త జిల్లాకు కేంద్రస్థానం అయింది. ఈ జిల్లాలోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్‌నగర్ జిల్లాలోనివే. సమరయోధుడు చిట్టెం నర్సిరెడ్డి, రాజకీయ నాయకులు నాగూరావు నామాజీ, స్వర్ణ సుధాకర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి ఈ జిల్లాకు చెందినవారు. చంద్రగడ్‌లో పురాతనమైన కోట ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: తెలంగాణ రాష్ట్రంలోనే అతి పశ్చిమాన ఉన్న జిల్లా నారాయాణపేట జిల్లా. ఈ జిల్లా కర్ణాటక సరిహద్దులో ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన వికారాబాదు జిల్లా, తూర్పున మహబూబ్‌నగర్ జిల్లా, దక్షిణాన కర్ణాటకతో పాటు వనపర్తి, గద్వాల జిల్లాలు, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా దక్షిణ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. చరిత్ర లోకపల్లి సంస్థానం పాలనాధీశులు చాలా కాలం పాటు నారాయణపేట కేంద్రంగా పాలించారు. మహారాష్ట్రీయులైన లోకపల్లి సంస్థానాధీశుల ప్రభావం ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఉంది. సంస్థాన కాలం నాటి కోటలు, పురాతన భవనాలే కాకుండా ఇక్కడి ప్రజలపై మరాఠీ భాషా ప్రభావం కూడా ఉంది. 1948 సెప్టెంబరు 17న భారత యూనియన్‌లో విలీనమైన ఈ ప్రాంతం 8 సం.ల పాటు హైదరాబాదు రాష్ట్రంలో కొనసాగించి. 1956 నవంబరు 1 నుంచి 2014 జూన్ 2 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్ గా ఉండింది. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం కూడా ఈ ప్రాంతం మహబూబ్‌నగర్ జిల్లాలోనే కొనసాగించి. ప్రత్యేక జిల్లాగా చేయాలనే ప్రతిపాదన రావడంతో డిసెంబరు 31, 2018న 12 మండలాలలో జిల్లా ఏర్పాటుకు ముసాయిదా ప్రకటన వెలువడింది. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా కోయిలకొండ మండలాన్ని మహబుబ్‌నగర్ జిల్లాలోనే కొనసాగిస్తూ మిగితా 11 మండలాలతో 2019 ఫిబ్రవరి 16న నారాయణపేట జిల్లా ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు విడుదల చేసింది. జిల్లాలోని మండలాలు నారాయణపేట మండలం, దామరగిద్ద మండలం, ధన్వాడ మండలం, మరికల్ మండలం, కోస్గి మండలం, మద్దూరు మండలం, ఉట్కూరు మండలం, నర్వ మండలం, మాగనూరు మండలం, కృష్ణా మండలం, మక్తల్ మండలం, ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
16, ఫిబ్రవరి 2019, శనివారం
నారాయణపేట జిల్లా (Narayanapet Dist)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి