రావుల చంద్రశేఖర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. జూన్ 1, 1955న కొత్తకోట మండలం కానాయపల్లిలో జన్మించిన చంద్రశేఖర్ రెడ్డి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బి అభ్యసించారు. 1982లో కానాయపల్లి సర్పంచిగా రాజకీయ జీవితం ప్రారంభించి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి, 1985లో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శిగా, 1987లో అధ్యక్షుడిగా ఎన్నికైనారు. 1989లో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మెన్‌గా నియమితులైనారు. 1991లో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా రెండోసారి నియమించబడ్డారు. 1994లో వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై 1996లో ప్రభుత్వ విప్ గా కూడా పనిచేశారు. 2002, 2008లలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనారు. 2009లో వనపర్తి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, కొత్తకోట మండలము, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం, 13వ శాసనసభ సభ్యులు, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి