కొత్తకోట వనపర్తి జిల్లాకు చెందిన మండలము. 7వ నెంబరు (కొత్తపేరు 44) జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. సికింద్రాబాదు-డోన్ రైలు మార్గం కూడా మండలం గుండా పోవుచున్నది. వనపర్తి రోడ్ పేరిట మదనాపురంలో రైల్వేస్టేషన్ ఉంది. ఈ మండలము వనపర్తి రెవెన్యూ డివిజన్, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. కొత్తకోత చేనేత వస్త్రాలకు పేరుగాంచింది. సరళాసాగర్ ప్రాజెక్టు మండల పరిధిలో ఉంది. మండల పరిధిలో కొత్తగా చక్కెర కర్మాగారం నిర్మిస్తున్నారు. నిజాం కాలంలో కొత్వాలుగా పనిచేసిన పింగళి వెంకట్రాంరెడ్డి, ఆలంపూర్ నుంచి 3 సార్లు విజయం సాధించిన రావుల రవీంద్రనాథ్ రెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లిపూర్ నర్సింహయ్య, సంస్కృతాంధ్ర పండితుడు పెరవలి లింగయ్యశాస్త్రి మండలానికి చెందినవారు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 79527.మండల పరిధిలోని కనిమెట్ట సమీపంలో జాతీయ రహదారి పక్కనే శ్రీశ్రీశ్రీ కలియుగ వైకుంఠ హరిహర అయ్యప్ప క్షేత్రం ఉన్నది. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 22 రెవెన్యూ గ్రామాలు, 22 గ్రామపంచాయతీలు కలవు మండల సరిహద్దులు: ఈ మండలమునకు ఉత్తరమున దేవరకద్ర, పెద్దమందడి మండలములు, తూర్పున పెద్దమందడి, వనపర్తి మండలములు, దక్షిణమున పెబ్బేరు మండలము, పశ్చిమాన ఆత్మకూరు, చిన్నచింతకుంట మండలములు సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 69756. ఇందులో పురుషులు 35475, మహిళలు 34281. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 79527. ఇందులో పురుషులు 40395, మహిళలు 39132. పట్టణ జనాభా 19054, గ్రామీణ జనాభా 60473. జనాభాలో ఇది జిల్లాలో 8వ స్థానంలో ఉంది. రవాణా సౌకర్యాలు: 44వ నెంబరు జాతీయ రహదారి మండలం నుంచి వెళ్ళుచున్నది. కొత్తకోత జాతీయ రహదారిపై ఉన్న ప్రధాన కూడలి. ఇచ్చటినుంచి ఆత్మకూరు, వనపర్తిలకు రహదారి సౌకర్యం ఉంది. చరిత్ర - తెలంగాణ ఉద్యమం: 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమం మరియు 2009-14 మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ మండలం ప్రముఖ పాత్ర వహించింది. 2010లో మిరాశిపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని కావలి సువర్ణ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, ఎందరో అమరులైతున్ననూ ప్రత్యేక తెలంగాణ ఇవ్వడానికి అప్పటి ప్రభుత్వం నిరాకరించడంతో తీవ్రంగా చలించి తన చావువల్ల నైనా ప్రభుత్వానికి కనువిప్పి కావాలని జనవరి 19, 2010న వాంగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకుంది. 2011లో 42 రోజుల పాటు సకలజనుల సమ్మె మండలంలో పూర్తిగా జయప్రదమైంది. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారస్తులు, కార్మికులు, న్యాయవాదులు, రైతులు, మహిళలు ఇలా ప్రతి రంగానికి చెందినవారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. జూన్ 2, 2014న ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ మండలంలో ఉన్న ఈ మండలం అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లాలో చేరింది.
ఈ మండలము దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగము. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.విశ్వేశ్వర్ ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: మండలంలో 66 ప్రాథమిక పాఠశాలలు (53 మండల పరిషత్తు, 13 ప్రైవేట్), 13 ప్రాథమికోన్నత పాఠశాలలు (6 మండల పరిషత్తు, 7 ప్రైవేట్), 25 ఉన్నత పాఠశాలలు (2 ప్రభుత్వ, 11 జడ్పీ, 12 ప్రైవేట్), 3 జూనియర్ కళాశాలలు (1 ప్రభుత్వ, 2 ప్రైవేట్) ఉన్నవి. వ్యవసాయం, నీటిపారుదల: మండలం మొత్తం విస్తీర్ణం 25212 హెక్టార్లలో 50% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట వరి. వేరుశనగ, కందులు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 545 మిమీ. మండలంలో సుమారు 5100 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. మండలంలోని 10 గ్రామాలకు సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీరు లభిస్తుంది. కాలరేఖ:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
22, జనవరి 2013, మంగళవారం
కొత్తకోట మండలం (Kothakota Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి