24, జనవరి 2013, గురువారం

తిమ్మాజీపేట మండలము (Thimmajipet Mandal)

జిల్లా నాగర్‌కర్నూల్
రెవెన్యూ డివిజన్నాగర్‌కర్నూల్
జనాభా33500 (2001)
40481 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంనాగర్‌కర్నూల్
లోకసభ నియోజకవర్గంనాగర్‌కర్నూల్
పర్యాటక ప్రాంతాలుఆవంచ
ముఖ్య పంటలుమొక్కజొన్న
మండల ప్రముఖులుమర్రి జనార్థన్ రెడ్డి
తిమ్మాజీపేట నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్, నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు, 19 గ్రామపంచాయతీలు కలవు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 40481. ఆవంచలో దేశంలోనే పెద్దదైన గుండుగణపతి ఉంది. ప్రముఖ వస్త్రవ్యాపారి (జెసి బ్రదర్స్ షాపింగ్ మాల్స్ అధినేత) మరియు ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు.

సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున జడ్చర్ల, మిడ్జిల్ మండలములు, తూర్పున తాడూరు మండలము, దక్షిణమున బిజినేపల్లి మండలము, పశ్చిమాన భూత్పూర్ మండలము సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 33500. ఇందులో పురుషులు 16628, మహిళలు 16872. 
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 40481. ఇందులో పురుషులు 20336, మహిళలు 20145. జనాభాలో ఇది జిల్లాలో 59వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
జడ్చర్ల- బిజినేపల్లి రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. హైదరాబాదు నుంచి నాగర్ కర్నూల్ వెళ్ళు వాహనాలు ఈ రోడ్డు ద్వారానే ప్రయాణిస్తాయి.

రాజకీయాలు:
ఈ మండలము నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగము. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వి.దస్రం నాయక్ ఎన్నికయ్యారు.2006 సర్పంచి ఎన్నికలలో మండలంలోని 19 గ్రామపంచాయతీలకుగాను కాంగ్రెస్ పార్టీ 12, తెలుగుదేశం పార్టీ 5, భారతీయ జనతా పార్టీ 2 పంచాయతీలలో విజయం సాధించాయి. భాజపా నేత జుక్కా రఘునందన్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు.

నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో
తిమ్మాజీపేట మండల స్థానం (గులాబి రంగు)
విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 34 ప్రాథమిక పాఠశాలలు (33 మండల పరిషత్తు, 1 ప్రైవేట్), 8 ప్రాథమికోన్నత పాఠశాలలు (7 మండల పరిషత్తు, 1 ప్రైవేట్), 7 ఉన్నత పాఠశాలలు (అన్నీ జడ్పీ), 1 ప్రభుత్వ జూనియర్ కళాశాలు ఉన్నది.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 20085 హెక్టార్లలో 24% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న. ప్రత్తి, వరి. జొన్నలు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 643 మిమీ. మండలంలో సుమారు 900 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

కాలరేఖ:
  • 2014, జనవరి 6: తెరాస రాష్ట్ర కార్యదర్శిగా నేరెళ్ళపల్లి గ్రామానికి చెందిన జక్క రఘునందన్ రెడ్డి నియమితులైనారు. 


విభాగాలు: నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు,  తిమ్మాజీపేట మండలము, నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్, నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక