నాగర్‌కర్నూల్ జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా అవతరించింది. జిల్లాలో 20 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. తెలంగాణలోనే ప్రముఖమైన అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్, మామిడిపండ్లకు ప్రసిద్ధి చెందిన కొల్లాపూర్, ప్రాచీన రాజధాని వర్థమానపురం, ప్రముఖ ఆంజనేయస్వామి దేవాలయం ఊర్కొండ, శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైవ వట్టెం, సీతారామస్వామి ఆలయం సిర్సనగండ్ల, మల్లెలతీర్థం ఈ జిల్లాకు చెందినవి. ఈ ప్రతిపాదిత జిల్లాలోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్‌నగర్ జిల్లాలోనివే. ఒకప్పుడు జిల్లా పరిపాలన కేంద్రంగా పనిచేసిన నాగర్‌కర్నూల్ పట్టణం మళ్ళీ 112 సంవత్సరాల అనంతరం జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది.
సరిహద్దులు: ఈ జిల్లాకు తూర్పున నల్గొండ జిల్లా, పశ్చిమాన వనపర్తి జిల్లా, ఉత్తరాన రంగారెడ్డి జిల్లా, వాయువ్యాన మహబూబ్‌నగర్ జిల్లా, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. మండలాలు: బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, టెల్కపల్లి, తిమ్మాజిపేట్, తాడూరు, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేర్, కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూర్, చారకొండ, అచ్చంపేట, అమ్రాబాద్, పదర, బల్మూర్, లింగాల్, ఉప్పునూతల. రవాణా సౌకర్యాలు: హైదరాబాదు నుంచి శ్రీశైలం వెళ్ళు రహదారి జిల్లా గుండా వెళ్ళుచున్నది. బిజినేపల్లి జిల్లాలోని ప్రముఖ రోడ్డు కూడలి. ఇక్కడ్ నుంచి హైదరాబాదు, మహబూబ్‌నగర్, వనపర్తి, శ్రీశైలం పట్టణాలకు రహదారులు ఉన్నాయి. జిల్లాకు రైలుసౌకర్యం లేదు. ప్రముఖులు: తొలి తెలుగు రామాయణం రచించిన గోనబుద్ధారెడ్డి, కవిపండితుడు కపిలవాయి లింగమూర్తి, రచయిత ముకురాల రామారెడ్డి, రచయిత్రి పాకాల యశోధారెడ్డి, 1969 తెలంగాణ ఉద్యమ నాయకుడు కె.అచ్యుతరెడ్డి, పాలెం గ్రామాన్ని అభివృద్ధిపర్చిన సుబ్రహ్మణ్యశాస్త్రి, రాజకీయనాయకులు నాగం జనార్థన్ రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు ఈ జిల్లాకు చెందిన ప్రముఖులు. ప్రముఖ పట్టణాలు: నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ జిల్లాలోని పెద్ద పట్టణాలు మరియు పురపాలక/నగర పంచాయతీలు. నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్‌లు రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా ఉన్నాయి. రాజకీయాలు: జిల్లా పరిధిలో కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కొల్లాపూర్ శాసనసభ్యుడు జూపల్లి కృష్ణారావు రాష్ట్రమంత్రిగా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో సుధీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన నాగం జనార్థన్ రెడ్డి ఈ జిల్లాకే చెందినవారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
Tags: News Districts in telangana, Nagar Kurnool Dist in Telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి