24, జనవరి 2013, గురువారం

తాడూరు మండలము (Tadoor Mandal)

జిల్లా నాగర్‌కర్నూల్
రెవెన్యూ డివిజన్ నాగర్ కర్నూల్
జనాభా38609 (2001)
38424 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంనాగర్ కర్నూల్
లోకసభ నియోజకవర్గంనాగర్ కర్నూల్
ముఖ్య పంటలుప్రత్తి, మొక్కజొన్న
తాడూరు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలము. ఇది నాగర్ కర్నూల్ రెవెన్యూ డివిజన్, నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు, 19 గ్రామపంచాయతీలు కలవు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 38424. చరిత్రలో ఇంద్రప్రస్థంగా పేరుపొందిన ఇంద్రకల్ గ్రామం ఈ మండలంలో ఉంది. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా పనిచేసిన వి.బాలకృష్ణమూర్తి ఈ మండలమునకు చెందినవారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలం 78డి 21' 7" తూర్పు రేఖాంశం, 16డి 30' 54" ఉత్తర అక్షాంశంపై ఉన్నది.  మండల వైశాల్యం 225.35 చకిమీ. ఈ మండలమునకు ఉత్తరమున మిడ్జిల్ మండలము, తూర్పున కల్వకుర్తి మండలము, దక్షిణాన టెల్కపల్లి, నాగర్ కర్నూల్ మండలములు, పశ్చిమాన బిజినేపల్లి, తిమ్మాజీపేట మండలములు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 38609. ఇందులో పురుషులు 19403, మహిళలు 19206. ఎస్సీల సంఖ్య 9564, ఎస్టీల సంఖ్య 1210. జనసాంద్రత 171/చకిమీ. స్త్రీపురుష నిష్పత్తి 988.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 38424. ఇందులో పురుషులు 19282, మహిళలు 19142. జనాభాలో ఇది జిల్లాలో 62వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
నాగర్ కర్నూల్ నుంచి కల్వకుర్తి వెళ్ళు రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది.

నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో
తాడూరు మండల స్థానం (పసుపు రంగు)
రాజకీయాలు:
ఈ మండలము నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం మరియు నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2006-11 కాలంలో జిల్లా పరిషత్తు చైర్మెన్ గా ఉన్న కూచుకుళ్ళ దామొదర్ రెడ్డి ఈ మండలం నుంచే జడ్పీటీసి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 28 ప్రాథమిక పాఠశాలలు (ప్రభుత్వ 1, మండల ప్రిషత్తు 26, ప్రైవేట్ 1), 9 ప్రాథమికోన్నత పాఠశాలలు (మం.ప.8, ప్రైవేట్ 1), 8 ఉన్నత పాఠశాలలు (ప్రభుత్వ 2, జడ్పీ 6), ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 22537 హెక్టార్లలో 62% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట ప్రత్తి, మొక్కజొన్న. వరి, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 516 మిమీ. మండలంలో సుమారు 2000 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

తాడూరు మండల పరిషత్తు కార్యాలయము


విభాగాలు: నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు,  తాడూరు మండలము, నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్, నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం,  
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక