గుర్కా జైపాల్ యాదవ్ రంగారెడ్డి జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. జైపాల్ యాదవ్ 1954 ఆగస్టు 14న జన్మించారు. ఇతని స్వస్థలం తలకొండపల్లి మండలం చల్లంపల్లి గ్రామం. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టి జిల్లా అధ్యక్షపదవిని కూడా చేపట్టారు. సర్పంచిగ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 2 సార్లు జడ్పీటీసిగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, తెదేపా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.
రాజకీయ జీవితం:
జైపాల్ యాదవ్ 1981లో చల్లంపల్లి గ్రామ సర్పంచిగా ఎన్నికై రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ప్రారంభంలో జనతాపార్టీలో ఉండి, 1986లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1988లో తెలుగుదేశం పార్టి జిల్లా కార్యదర్శి పదవి చేపట్టారు. 1991లో తలకొండపల్లి జడ్పీటీసి సభ్యునిగా ఎన్నికయ్యారు. 1994-99 కాలంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1999లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 2006లో వంగూరు జడ్పీటీసిగా విజయం సాధించారు. 2009లో రెండవసారి కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

విభాగాలు: రంగారెడ్డి జిల్లా ప్రముఖులు, తలకొండపల్లి మండలము, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, 13వ శాసనసభ సభ్యులు, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి