1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

గుర్కా జైపాల్ యాదవ్ (Gurka Jaipal Yadav)

గుర్కా జైపాల్ యాదవ్ పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. జైపాల్ యాదవ్ 1954 ఆగస్టు 14న జన్మించారు. ఇతని స్వస్థలం తలకొండపల్లి మండలం చల్లంపల్లి గ్రామం.  కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టి జిల్లా అధ్యక్షపదవిని కూడా చేపట్టారు. సర్పంచిగ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 2 సార్లు జడ్పీటీసిగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, తెదేపా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.

రాజకీయ జీవితం:
జైపాల్ యాదవ్ 1981లో చల్లంపల్లి గ్రామ సర్పంచిగా ఎన్నికై రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ప్రారంభంలో జనతాపార్టీలో ఉండి, 1986లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1988లో తెలుగుదేశం పార్టి జిల్లా కార్యదర్శి పదవి చేపట్టారు. 1991లో తలకొండపల్లి జడ్పీటీసి సభ్యునిగా ఎన్నికయ్యారు. 1994-99 కాలంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1999లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 2006లో వంగూరు జడ్పీటీసిగా విజయం సాధించారు. 2009లో రెండవసారి కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, తలకొండపల్లి మండలము,  కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, 13వ శాసనసభ సభ్యులు,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక