షాద్ నగర్ రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఒకటి (స్టేషన్ కోడ్ SHNR). ఈ రైల్వేస్టేషన్ దక్షిణమధ్యరైల్వే జోన్ లోని హైదరాబాదు డివిజన్ లో భాగంగా సికింద్రాబాదు-డోన్ మార్గంలో ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 59 కిమీ, డోన్ నుంచి 238 కిమీ దూరంలో ఉంది. ఈ స్టేషన్ HBL నగర్ మరియు బూర్గుల (హాల్ట్) స్టేషన్ల మధ్యన HBL నగర్ నుంచి10 కిమీ, బూర్గుల నుంచి 10 కిమీ దూరంలో ఉన్నది. ఈ స్టేషన్ నుంచి రోజూ 20 రైళ్ళు (రాను పోను కలిపి) వచ్చిపోతుంటాయి.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు, షాద్‌నగర్ మండలము, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి