|
మల్డకల్ వేంకటేశ్వరస్వామి ఆలయం |
రెండవ తిరుపతి గా వెలుగొందుతున్న మొదలకల్ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణం లో ఆది శిలా క్షేత్రాన్ని గురించి వివరించారు. మొదలు అనగా 'ఆది' అని, కల్లు అనగా 'రాయి' అని కన్నడలో అర్థము. బ్రహ్మ దేవుడు ఒక శిలను సృష్టించి 'ఆదిశిల' అని పేరు పెట్టాడని, అక్కడే పరమశివుడు తపస్సు నాచరించాడని, అట్టి శిలపై శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, అనంతశయన మూర్తి, వరాహస్వామి, ఆంజనేయుడు, ఒకే శిలపై ఉద్భవించారు. క్షేత్ర పాలకుడు అయిన పరమేశ్వరుడు ఇచ్చట సతీసమేతంగా వెలిసి యున్నాడు. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు అరణ్యంగా ఉండేది. ఒక రోజు
గద్వాల సంస్థానాధీశుడు అయిన నలసోమనాద్రి రాజు గుర్రము పైన వేటకై మల్దకల్ ప్రాంతానికి రాగా ఒక చోట అతని గుర్రము అకస్మాత్తు గా ఆగిపోగా, రాజు ఈ ప్రాంతము లో ఏదో మహాత్యము ఉందని భావించి, దగ్గరలో ఉన్న పశువుల కాపరిని పిలిచి విచారించగా అక్కడే పొదలలో కల విగ్రహాన్ని చూపాడు. నా గుర్రం పరిగెత్తితే నీకు గుడి కట్టిస్తానని మొక్కి తన గుర్రం ఎక్కగానే అది రెట్టించిన వేగంతో పరిగెత్తి తన ప్రయాణాన్ని పూర్తి చేసిందని చరిత్ర చెబుతుంది. అప్పుడు రాజు గారు దేవాలయాన్ని కట్టించి ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి, అడవిలో విగ్రహాన్ని చూపిన పశువుల కాపరి అయిన బోయవాడిని పూజారిగా నియమించాడు. నేటికీ ఈ దేవాలయంలో అతని సంతతి వారే పూజాధికాలు నిర్వహిస్తుంటారు. ఈ గ్రామంలో ఎవ్వరూ రెండవ అంతస్థు ఇల్లు కట్టకపోవడం విశేషం. స్వామివారి గోపురం కంటె ఎత్తు ఇళ్ళు ఉండరాదని, ఇదివరకు ఈ విధంగా చేసినవారికి అరిష్టాలు జరిగాయని ప్రచారంలో ఉంది. ఇతర మతస్థులు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇక్కడి వారు తిరుపతికి కూడా వెళ్ళరు. ఇదే తిరుపతిగా భావిస్తూ ఇక్కడే దర్శనం చేసుకుంటారు. ఇది గిరిశాచల క్షేత్రంగా కూడా పిలువబడుతుంది. ఏటా మార్గశిరంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
= = = = =
HI...SIR
రిప్లయితొలగించండిIt Was really useful for all thank u thank you soooo much
bheema 9866118011
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు
తొలగించండి