12, ఫిబ్రవరి 2013, మంగళవారం

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (Priyadarshini Jurala Project)

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు
మహబూబ్ నగర్ జిల్లా లోని ప్రముఖ ప్రాజెక్టులలో జూరాలా ప్రాజెక్టు ఒకటి. ఈ ప్రాజెక్టు ధరూరు మండలం రేవులపల్లి గ్రామం వద్ద నిర్మించబడింది. ఇది ఒక పర్యాటక స్థలంగానూ అభివృద్ధి చెందింది. కృష్ణానది ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించిన తరువాత ఈ నదిపై నిర్మించియున్న మొదటి ప్రాజెక్టు ఇదే. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 1981 లో ప్రారంబించి, 1996 లో మొదటి దశ కింద నీటిని విడుదల చేశారు. నిర్మాణం పూర్తి కావడానికి సుమారు 15 సంవత్సరాల కాలం పట్టింది. ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వ్యయం రూ.76.40 కోట్లు కాగా వాస్తవంగా సుమారు రూ.550 కోట్లు ఖర్చయింది. ఈ ప్రాజెక్టు కింద మొత్తం లక్ష ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. ఆత్మకూరు నుంచి గద్వాల వెళ్ళు రోడ్డు మార్గములో ఆత్మకూరు పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది. ఆత్మకూరు-గద్వాల రహదారి ఈ ప్రాజెక్టు పైనుంచి వెళ్ళుతుంది. ఇది పర్యాటక స్థలంగా కూడా విలసిల్లుతోంది. ఇక్కడ 240 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పాదన కేంద్రం నిర్మించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
జలవిద్యుత్ కేంద్రం:
జూరాలా జలవిద్యుత్ కేంద్రంలో 6 యూనిట్లు ఉన్నాయి. ఒక్కోదాని సామర్థ్యం 39 మెగావాట్లు. మొత్తం విద్యుత్ సామర్థ్యం 234 మెగావాట్లు. 2004 డిసెంబరులో పనులు ప్రారంభం కాగా 2008 ఆగస్టులో 2 యూనిట్లు, 2009 మేలో 3వ యూనిట్ ప్రారంభమైంది.
కుడి, ఎడమ కాల్వలు:
జూరాల కుడి కాలువ 50 కిమీ పొడవు, ఎడమ కాలువ 85 కిమీ పొడవు ఉన్నాయి.ఇవి 67500 ఎకరాలకు నీరందిస్తాయి. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా బేసిన్‌లో జూరాలకు 11.94 టీఎంసీలు కేటాయించారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులు, ధరూర్ మండలము,   
= = = = =
సంప్రదించిన గ్రంథాలు:
 • తెలుగు వికీపీడియా,
 • ఆంగ్ల వికీపీడియా,
 • జలవనరులు (రచన- సిద్దాని నాగభూషణం),
 • బ్లాగు రచయిత సందర్శించి సేకరించిన విషయాలు,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక