ఫరూఖ్‌నగర్ గ్రామానికి చెందిన ఎస్.కె.రంగారావు జూలై 5, 1914న జన్మించారు. విద్యావేత్తగా, స్వాతంత్ర్య సమరయోధునిగా పేరుపొందిన రంగారావు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. స్వాతంత్ర్యోద్యమంలో బూర్గుల రామకృష్ణారావు అనుచరుడిగా పనిచేశారు. విమోచనొద్యమం తర్వాత పట్టణంలో విద్యావ్యాప్తికై కృషిచేశారు. షాద్‌నగర్ లో మొదటి టీచర్ ట్రైనింగ్ సెంటర్‌ను, మొదటి డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. 2009 మే 3న మరణించారు.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా సమరయోధులు, షాద్‌నగర్ మండలము, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి