17, ఏప్రిల్ 2013, బుధవారం

ఆర్మూరు మండలము (Armur Mandal)

 ఆర్మూరు మండలము
జిల్లా నిజామాబాదు
రెవెన్యూ డివిజన్ నిజామాబాదు
జనాభా113018(2001)
121408(2011)
అసెంబ్లీ నియోజకవర్గంఆర్మూరు
లోకసభ నియోజకవర్గంనిజామాబాదు
పర్యాటక ప్రాంతాలుసిద్దేశ్వర ఆలయము
ముఖ్య పంటలువరి, సోయాబీన్,
మండల ప్రముఖులు
ఆర్మూరు నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. పూర్వము ఆర్మూరును నవనాతపురం అని పిలిచేవారు. 7వ మరియు 16వ నెంబరు జాతీయ రహదారులు మండలం గుండా వెళ్ళుచున్నాయి. దక్షిణ దిశయందు ఉన్న కొండ మీద నవనాథ సిద్దేశ్వర ఆలయము కలదు. స్థానిక ప్రజలు నవనాథులు లేదా సిద్ధులు ఈ ప్రాంతములోని సహజమైన గుహలు, కొండ చరియలలో ఇప్పటికీ నివసిస్తున్నారని నమ్ముతారు. గుట్టపైన అందాలు ఆరబోసినట్లు పచ్చని ప్రకృతి, అందమైన గుహలు, గుహలో వెలసిన నవనాథ సిధ్దేశ్వర దేవాలయం మరియు గుట్ట మధ్యన విశాలమైన స్థలంలో నిర్మితమైన రామాలయం చూడముచ్చగా ఉన్నది. గుట్టపైన కొండల మధ్య చిన్న చెరువు ఉంది. మెట్ల మార్గంలో అమ్మవారి దేవాలయం ఉంది. అక్కడి నుండి గుట్టపైకి ఎక్కే మార్గంలో హనుమాన్ మందిరం ఉన్నది. భౌగోళికంగా ఈ మండలం నిజామాబాదు జిల్లా ఉత్తరము వైపున ఉన్నది. మండల కేంద్రము నిజామాబాదు నుంచి 27 కిలో మీటర్లు, హైదరాబాదు నుంచి 175 కిలో మీటర్ల దూరంలో ఉన్నది. మండలంలోని అంకాపూర్ ఆదర్శగ్రామంగా పేరుపొందినది. మండలంలో 22 రెవెన్యూ గ్రామాలున్నాయి.

భౌగోళికం,మండల సరిహద్దులు:
ఆర్మూరు మండలము నిజామాబాదు జిల్లాలో ఉత్తరం వైపున 18డి 47' 24" ఉత్తర అక్షాంశం, 78డి 16' 40" తూర్పు రేఖాంశంపై ఉంది. తూర్పున బాల్కొండ, వేల్పూరు మండలాలు, దక్షిణమున జక్రాన్‌పల్లి మండలము, పశ్చిమాన మాక్లూర్, నందిపేట మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 113018. ఇందులో పురుషులు 56008, మహిళలు 57010. జనసాంద్రత 262/చకిమీ. స్త్రీపురుష నిష్పత్తి ప్రతి వెయ్యు పురుషులకు 1023 మహిళలు. ఎస్సీల సంఖ్య 17751, ఎస్టీల సంఖ్య 3032.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 121408. ఇందులో పురుషులు 59008, మహిళలు 62400. పట్టణ జనాభా 64042, గ్రామీణ జనాభా 57366. అక్షరాస్యత శాతం 68.58%. ఇది జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కల మండలాలలో మూడవ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
7వ నెంబరు (కొత్తపేరు 44వ) మరియు నిజామాబాదు-జగదల్‌పూర్ 16వ నెంబరు జాతీయ రహదారులు మండలం గుండా వెళ్ళుచున్నాయి. మండల కేంద్రం 44వ నెంబరు జాతీయ రహదారికి 2 కిమీ లోపల ఉండగా 16వ నెంబరు జాతీయ రహదారి ఆర్మూరు గుండా వెళుతుంది. పెర్కిట్ వద్ద రెండు జాతీయ రహదార్లు కలియుచున్నాయి. మండలం గుండా రైల్వేలైన్ లేకున్ననూ నిజామాబాదు రైల్వేస్టేషన్ అందుబాటులో ఉన్నది.

మండల ప్రముఖులు:
  • ఏలేటి మహిపాల్ రెడ్డి (మాజీ మంత్రి),
  • సి,పార్థసారథి (ఐఏఎస్ అధికారి),
  • ఏలేటి అన్నపూర్ణమ్మ (ప్రస్తుత ఎమ్మెల్యే),
  • బాజిరెడ్డి గోవర్థన్ (మాజీ ఎమ్మెల్యే),
  • పి.గంగారెడ్డి (జిల్లా భాజపా అధ్యక్షులు),
 
దర్శనీయ ప్రదేశాలు:
చారిత్రాత్మకమైన సిద్ధుల గుట్ట, నవనాథ సిద్ధేశ్వరాలయం ఆర్మూరు పట్టణ సమీపంలో కలవు. గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సరిహద్దులో ఉన్న బాల్కొండ మండలంలో ఉన్నది. ఆదర్శగ్రామంగా పేరుపొందిన అంకాపూర్ ఈ మండలంలోనిదే.

రాజకీయాలు:
ఈ మండలము ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2009లో ఏలేటి అన్నపుర్ణమ్మ ఇక్కడి నుంచి విజయం సాధించారు. భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న పి.గంగారెడ్డి మండలంలోని అంకాపూర్ గ్రామానికి చెందినవారు.

వ్యవసాయం, పంటలు:
మండలం మొత్త వైశాల్యం 22916 హెక్టార్లలో సుమారు 10వేల హెక్టార్ల భూమి సాగుకు యోగ్యంగా ఉంది. సోయాబీన్ 4600 హెక్టార్లలో, వరి 4600 హెక్టార్లలో (ఖరీఫ్, రబి కలిసి), మొక్కజొన్న 2700 హెక్టార్లలో, పసుపు 2000 హెక్టార్లలో పండిస్తారు. ఇవికాకుండా బాజ్రా, మినుములు, కందులు, మిరప, ఉల్లి సాగుకూడా చేస్తారు. సుమారు 6300 హెక్టార్ల భూమికి బోరింగుల ద్వారా నీటివసతి ఉంది.

విద్యాసంస్థలు:
మండలంలో 64 ప్రాథమిక పాఠశాలలు (ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, 39 మం.ప, 24 ప్రైవేట్), 20 ప్రాథమికోన్నత పాఠశాలలు (ఒకటి మం.ప, 19 ప్రైవేట్), 43 ఉన్నత పాఠశాలలు (ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, 20 జిల్లాపరిషత్తు, 22 ప్రైవేట్), 7 జూనియర్ కళాశాలలు (3 ప్రభుత్వ, 4 ప్రైవేట్), 4 డిగ్రీ కళాశాలలు (ఒకటి ప్రభుత్వ, 4 ప్రైవేట్), ఒక పిజి సెంటర్, ఒక బీఎడ్ కళాశాల, ఒక పారామెడికల్ ఇన్‌స్టిట్యూట్ ఉన్నాయి.

మండల విశిష్టతలు:
  • 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మండలం జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కలిగిన మండలాలలో మూడవ స్థానంలో ఉంది. 
కాలరేఖ:
  • 2006, మే 26: ఆర్మూరు పురపాలక సంఘం ఏర్పడింది.
  • 2013, ఏప్రిల్ 27: ఆర్మూరులో తెలంగాణ రాష్ట్ర సమితి 12వ వార్షికోత్సవ మహాసభ నిర్వహించబడింది.
విభాగాలు: నిజామాబాదు జిల్లా మండలాలు,  ఆర్మూరు మండలము,  నిజామాబాదు రెవెన్యూ డివిజన్,  ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గం, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక