కొత్త కృష్ణారెడ్డి
(1916-1983)
| |
జననం | ఏప్రిల్ 24, 1916 |
స్వస్థలం | పేరూరు ( దేవరకద్ర మండలం) |
చేపట్టిన పదవులు | మహబూబ్‌నగర్ జడ్పీ చైర్మెన్ |
మరణం | 1983 |
కొత్త కృష్ణారెడ్డి పాలమురు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. దేవరకద్ర మండలం పేరూరులో ఏప్రిల్ 24, 1916న జన్మించిన కొత్త కృష్ణారెడ్డి జిల్లా రాజకీయాలలో కె.కె.రెడ్డిగా సుప్రసిద్ధులు. ప్రారంభంలో కాంట్రాక్టరుగా పనిచేసి రాజకీయాలలోకి వచ్చారు. మద్దూరు పంచాయతి సమితి అధ్యక్షులుగా, జిల్లా పరిషత్తు అధ్యక్షులుగా, ఖాదీబొర్డు చైర్మెన్‌గా పనిచేశారు. మహబూబ్‌నగర్ పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాల ప్రారంభమగుటకు వీరి కృషి చేశారు. 1983లో కెకె రెడ్డి మరణించారు. వీరి జీవిత విశేషాలతో బి.కృష్ణయ్య "చైతన్యమూర్తి" గ్రంథాన్ని రచించారు. కెకె రెడ్డి భార్య 1957లో ఆలంపూర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. కుమారుడు బసిరెడ్డి చిత్ర నిర్మాతగా పేరుపొందారు.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, దేవరకద్ర మండలము, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి