23, మే 2013, గురువారం

డోకూర్ (Dokur)

డోకూర్ గ్రామము
గ్రామముడోకూర్
మండలముదేవరకద్ర
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2183 (2001)
డోకూర్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 1986 మండల వ్యవస్థకు పూర్వం ఈ గ్రామం ఆత్మకూరు తాలుకాలో భాగంగా ఉండేది. దేవరకద్ర నుండి రాయచూరు వరకు కొత్తగా నిర్మిస్తున్న రైల్వేలైనులో బాగంగా గ్రామంలో రైల్వేస్టేషన్ నిర్మించారు. (13.06.2011న ప్రారంభించారు). కవి డోకూరు బాలబ్రహ్మాచారి ఈ గ్రామమునకు చెందినవారు.
2014-15 విద్యాసంవత్సరం నుంచి అమలులోకి వచ్చే తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ముద్రించిన 6వ తరగతి సాంఘికశాస్త్రంలో ఈ గ్రామం గురించి ఒక పాఠం చేర్చబడింది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం మండలంలో పశ్చిమం వైపున చిన్నచింతకుంట మండలం సరిహద్దులో ఉంది. గ్రామానికి ఉత్తరాన గోపాలపూర్ కలాన్, తూర్పున మీనుగువానిపల్లి, దక్షిణాన గుడిబండ గ్రామాలు సరిహద్దులుగాఉండగా, పశ్చిమాన చిన్నచింతకుంట మండలం సరిహద్దుగా ఉన్నది. గ్రామానికి పశ్చిమ సరిహద్దులో పెద్దవాగు ప్రవహిస్తోంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 2183. ఇందులో పురుషులు 1119, మహిళలు 1064. గృహాల సంఖ్య 448.

రవాణా సౌకర్యాలు:
గ్రామం మీదుగా ఎలాంటి ప్రధాన రహదారులు లేవు. అయిననూ మహబూబ్‌నగర్-రాయచూర్ ప్రధాన రహదారి గ్రామం సమీపం నుంచి వెళ్ళుచున్నది. సికింద్రాబాదు-డోన్ రైలుమార్గంలో డోకూర్ వద్ద కొత్తగా రైల్వేస్టేషన్ నిర్మించారు.

రాజకీయాలు:
2006లో సర్పంచిగా యజ్ఞ భూపాల్ రెడ్డి విజయం సాధించారు. 1959 నుంచి 1970 వరకు భూపాల్ రెడ్డీ తండ్రి గ్రామ సర్పంచిగా బాల్ రెడ్డి పనిచేశారు. అనంతరం ఆయన అన్న సత్యనారాయణ రెడ్డి 1970-96 వరకు సర్పంచిగా కొనసాగారు. 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో మాధవి (తెరాస మద్దతు) సర్పంచిగా విజయం సాధించారు.

కాలరేఖ:
  • 2003 జనవరి 10న కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద ఆటోను రైలు ఢికొనడంతో 9 మంది మరణించారు. 
  • 2011, జూన్ 13: డోకూర్ రైల్వేస్టేషన్ ప్రారంభించబడింది.
  •  

విభాగాలు: దేవరకద్ర మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక