14, మే 2013, మంగళవారం

మూలమళ్ళ జయరాములు (Mulamalla Jayaramulu)

మూలమళ్ళ జయరాములు
స్వస్థలంగుమ్మడం
రంగంసమరయోధుడు, రాజకీయాలు
పదవులుఎమ్మెల్యే (1978-83)
నియోజకవర్గంవనపర్తి


మూలమళ్ళ జయరాములు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందినవారు. పండితుడు, కవి, సమరయోధుడు, రాజకీయ నాయకుడిగా పేరుపొందారు. 1947లో విమోచనోద్యంలో పాల్గొని నిరంకుశ నిజాం పోలీసులచే లాఠీదెబ్బలు తిన్నారు. అరెస్ట్ కాబడి తప్పించుకున్నారు, మళ్ళీ అరెస్ట్ అయి జైలుశిక్ష కూడా పొందారు. ఇతను జైల్లో ఉన్నప్పుడే రజాకార్లు ఇతని పుస్తకాల దుకాణాన్ని దగ్దంచేసి నష్టాన్ని కలిగించారు. ఈయన సేవలకుగాను ఆగస్టు 15, 1972లో భారత ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధులకిచ్చే తామ్రపత్రం ఇచ్చి సత్కరించింది. జయరాములు ఏప్రిల్ 24, 1985న మరణించారు.
 
రాజకీయ ప్రస్థానం::
1946-57 కాలంలో జయరాములు వనపర్తి  తాలుకా కాంగ్రెస్ అధ్యక్షులుగా, 1964-71లో తాలుకా వ్యవసాయ కూలీల అధ్యక్షులుగా వ్యవహరించారు. 1971-75 వరకు గుమ్మడం గ్రామసర్పంచిగా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేశారు. 1978లో వనపర్తి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైనారు.
 
 
 
ఇవి కూడా చూడండి:
 
 


హోం
విభాగాలు: వవపర్తి జిల్లా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక