24, జనవరి 2013, గురువారం

పెబ్బేరు మండలము (Pebbair Mandal)

జిల్లా వనపర్తి
రెవెన్యూ డివిజన్ వనపర్తి
జనాభా57633 (2001)
69691 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంవనపర్తి
లోకసభ నియోజకవర్గంనాగర్ కర్నూల్
పర్యాటక ప్రాంతాలుశ్రీరంగాపుర్,
ముఖ్య పంటలువరి
మండల ప్రముఖులు
పెబ్బేరు వనపర్తి జిల్లాకు చెందిన మండలము. ప్రముఖ పర్యాటకక్షేత్రం శ్రీరంగాపుర్ ఈ మండలంలోనే ఉంది. 44వ నెంబరు (పాత పేరు 7వ నెంబరు) జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. జిల్లాలోనే పెద్ద సంతగా పెబ్బేరుసంతకు పేరుంది. ఆత్మకూరు, పెబ్బేరు, కొత్తకోట మండలాల సరిహద్దులో ఊకశెట్టివాగు ప్రవహిస్తోంది. ఈ మండలము వనపర్తి రెవెన్యూ డివిజన్, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త ఎస్వీ రామారావు, ప్రముఖ కవి మల్యాల దేవీప్రసాద్, 1978లో వనపర్తి నుంచి ఎన్నికైన ఎం.జయరాములు, ప్రముఖ నవలా రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి, ఈ మండలమునకు చెందినవారు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 69691. మండలంలో ఒక పురపాలక సంఘం, 9 ఎంపీటీసి స్థానాలు, 20 రెవెన్యూ గ్రామాలు, 20 గ్రామపంచాయతీలు కలవు.

సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున కొత్తకోట, వనపర్తి మండలములు, తూర్పున పానగల్, వీపనగండ్ల మండలములు, దక్షిణమున కృష్ణానది దానికి ఆవల ఆలంపూర్, మానొపాడు మండలములు, పశ్చిమాన కృష్ణానది దానికి ఆవల ఇటిక్యాల మండలము సరిహద్దులుగాఉన్నాయి.

జనాభా:

2001 లెక్కల ప్రకారం మండల జనాభా 57633. ఇందులో పురుషులు 29394, మహిళలు 28239. 
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 69691. ఇందులో పురుషులు 35061, మహిళలు 33630. జనాభాలో ఇది జిల్లాలో 15వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
44వ నెంబరు జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. జాతీయరహదారి విస్తరణ సమయంలో మండల కేంద్రం నుంచి జాతీయరహదారి దూరంగా జరిగిననూ బస్సులు పెబ్బేరు నుంచే వెళతాయి. పెబ్బేరు నుంచి వనపర్తికి రహదారి సౌకర్యం ఉంది.

వనపర్తి నియోజకవర్గంలో
పెబ్బేరు మండల స్థానం (గులాబి రంగు)
రాజకీయాలు:
ఈ మండలము వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన కర్రెస్వామి ఎన్నికయ్యారు. 2006 సర్పంచి ఎన్నికలలో మండలంలోని 24 గ్రామపంచాయతీలకుగాను తెలుగుదేశం పార్టీ 10, కాంగ్రెస్ పార్టీ 8, భాజపా 2, ఇతరులు 4 పంచాయతీలలో విజయం సాధించాయి.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 48 ప్రాథమిక పాఠశాలలు (41 మండల పరిషత్తు, 7 ప్రైవేట్), 18 ప్రాథమికోన్నత పాఠశాలలు (8 మండల పరిషత్తు, 10 ప్రైవేట్), 21 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 13 జడ్పీ, 7 ప్రైవేట్), 2 జూనియర్ కళాశాలలు (1 ప్రభుత్వ, 1 ప్రైవేట్) ఉన్నవి.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 27687 హెక్టార్లలో 43% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట వరి. వేరుశనగ, కందులు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 536 మిమీ. మండలంలో సుమారు 10000 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. వరిపంట సాగులో మరియు నీటిపారుదలలో ఈ మండలం జిల్లాలోనే అగ్రస్థానంలో ఉంది.

కాలరేఖ:
  • 2013, మార్చి 23: పాతపల్లి నుంచి విడదీసి నాగసానిపల్లి కొత్త గ్రామపంచాయతి ఏర్పాటు చేయబడింది.



హోం,
విభాగాలు:
వనపర్తి జిల్లా మండలాలు,  పెబ్బేరు మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర (రచన- ఎస్వీ రామారావు), 
  • దుందుభి (గంగాపురం హనుమశ్చర్మ స్మారక సంచిక), 
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,

2 కామెంట్‌లు:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక