18, మే 2013, శనివారం

నీలం సంజీవరెడ్డి (Neelam Sanjeev Reddy)

 నీలం సంజీవరెడ్డి
జననం1913, మే 18
మరణం 1996, జూన్ 1
స్వస్థలంఇల్లూరు (అనంతపురం జిల్లా)
నిర్వహించిన పదవులురాష్ట్రపతి (1977-82), లోకసభ స్పీకర్ (1967-69 & 1977), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (1962-64),
స్వాతంత్ర్యోద్యమ నేతగా, రాజకీయ ప్రముఖుడిగా, ప్రముఖ పదవులు అధిష్టించిన వ్యక్తిగా తెలుగుజాతికి కీర్తి తెచ్చిన నీలం సంజీవరెడ్డి అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో 1913 మే 18న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. మద్రాసు థియొసోఫికల్ పాఠశాలలోను, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోను అభ్యసించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోకసభ స్పీకరుగా, భారత రాష్ట్రపతిగా పలు ఉన్నత పదవులు పొందిన ధీరుడితను.

1929లోనే మహాత్మాగాంధీ స్ఫూర్తితో చదువును పక్కనపెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్ర్య పోరాటం వైపు దృష్టి సారించారు. 1937లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్ళపాటు ఆ పదవిలో కొనసాగినారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని డిటెన్యూగా జైలుకు వెళ్ళారు. 1940-1945 మధ్య ఎక్కువ కాలం ఆయన జైలులో ఉన్నారు. 1946లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. 1947లో రాజ్యాంగ నిర్మాణ సంఘమైన రాజ్యాంగసభ కు ఎన్నికయ్యారు. 1949 నుండి 1951 వరకు మద్రాసు రాష్ట్ర రాష్ట్రంలో కుమార రాజాస్వామి మంత్రివర్గంలో పనిచేసారు.1951 లో మంత్రిపదవికి రాజీనామా చేసి, ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసి ప్రకాశం మద్దతుగల ఎన్జీరంగాను ఆ ఎన్నికలలో ఓడించారు. 1952లో రాజ్యసభకు ఎనికయ్యారు.

1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు సంయుక్త మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యుల నుండి కొత్త రాష్ట్ర కాంగ్రెసు శాసనసభా పక్ష నాయకుణ్ణి ఎన్నుకునే సమయంలో సంజీవరెడ్డి పోటీలేకుండా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి పదవి అవకాశం ఉన్నా తాను తప్పుకుని టంగుటూరి ప్రకాశం పంతులుకు నాయకత్వం అప్పగించి నీలం ఉపముఖ్యమంత్రి అయ్యారు. 1955లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని మరోసారి వదులుకున్న త్యాగశీలి సంజీవరెడ్డి. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్.జి.రంగా నాయకత్వంలోని కృషికార్ లోక్ పార్టీ మద్దతు కాంగ్రెసుకు అవసరమైంది. అయితే బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తాము మద్దతు ఇస్తామని రంగా ప్రకటించడంతో తాను తప్పుకుని మళ్ళీ ఉపముఖ్యమంత్రి అయ్యారు.

కాలరేఖ:
  • 1913, మే 19: ఇల్లూరులో జన్మించారు. 
  • 1949-51: భారత రాజ్యాంగసభ సభ్యులుగా ఉన్నారు.
  • 1951: ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులైనారు.
  • 1956 నవంబరు 1:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
  • 1962 మార్చి 12: రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
  • 1977: నంద్యాల నుంచి లోకసభకు ఎన్నిక.
  • 1967, మార్చి 17: లోకసభ స్పీకరుగా పదవిపొందారు.
  • 1977, మార్చి 26: రెండోసారి లోకసభ స్పీకరు అయ్యారు.
  • 1977, జూలై 25: 6వ రాష్ట్రపతిగా పదవిస్వీకారం. 
  • 1996, జూన్ 1: బెంగుళూరులో మరణించారు.
1956 నవంబరు1న ఆంధ్ర ప్రదేశ్ అవతరణలో సంజీవరెడ్డిది ప్రముఖపాత్ర. రాష్ట్ర స్థాపనలో ప్రధాన, నిర్ణాయక ఘట్టమైన పెద్దమనుషుల ఒప్పందంలో ఆంధ్ర తరపున అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి, బెజవాడ గోపాలరెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి కూడా పాల్గొని ఒప్పందంపై సంతకం పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ అవతరించాక, కాంగ్రెసు శాసనసభాపక్ష నాయకుడిగా బెజవాడ గోపాలరెడ్డిని ఓడించి, తాను ముఖ్యమంత్రి అయ్యాడు. అల్లూరి సత్యనారాయణ రాజును రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్ష పదవి పోటికి నిలబెట్టి, రంగాను ఓడించారు. నీలం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో భారీ ప్రాజకెటుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో మూడంచెల పంచాయతీరాజ్ పాలనను ప్రవేశపెట్టి అధికార వికేంద్రీకరణకు నాంది పలికారు. అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షపదవికి ఎన్నికవడంతో ముఖ్యమంత్రి పదవికి 1959 డిసెంబరులో రాజీనామా చేసారు. కాంగ్రెసు అధ్యక్షుడిగా రెండేళ్ళు పనిచేసి, మళ్ళీ 1962 లో రెండవసారి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. బస్సులను జాతీయంచేసే అంశంపై సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో 1964 ఫిబ్రవరిలో తనపదవికి రాజీనామా చేసి, కేంద్ర రాజకీయాలలో ప్రవేశించి లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధి మంత్రివర్గాలలో పనిచేశారు. రాజ్యసభ సభ్యునిగా ఉంటూ, 1967లో నాలుగో లోకసభకు హిందూపురం నియోజకవర్గం నుండి ఎన్నికై, లోక్‌సభకు స్పీకరుగా కూడా ఎన్నికయ్యారు. స్పీకరు నిష్పాక్షికంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎన్నిక కాగానే కాంగ్రెసు సభ్యత్వానికి రాజీనామా చేసి కొత్త సంప్రదాయానికి స్వీకారం చుట్టారు.
నీలం సంజీవరెడ్డి జనరల్ నాలెడ్జి

1969లో స్పీకరు పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతి పదవికి అధికార కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసారు. కాని ఇండిపెండెంటుగా పోటీచేసిన వి.వి.గిరి చేతిలో కొద్ది తేడాతో ఓడిపోయారు. దాంతో సంజీవరెడ్డికి 1975 వరకు రాజకీయ గ్రహణం అనుభవించారు. 1975 లో జయప్రకాశ్ నారాయణ్ హైదరాబాదులో జరిపిన పర్యటనతో రాజకీయాల్లో తిరిగి క్రియాశీలకంగా మారారు. 1977 లో ఎమర్జెన్సీ తరువాత, జనతాపార్టీ ప్రభంజనం దేశాన్ని చుట్టుముట్టి కాంగ్రెసును అధికారం నుండి దింపివేసినపుడు, తెలుగు ప్రజలు మాత్రం కాంగ్రెసుకు పట్టం కట్టారు. 42 స్థానాలకుగాను 41ని కాంగ్రెసు గెలుచుకుంది. జనతాపార్టీ గెలిచిన ఆ ఒక్క స్థానం నీలం సంజీవరెడ్డిదే. మళ్ళీ నీలం లోక్‌సభ స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే మళ్ళీ పదవికి రాజీనామా చేసి, నాలుగు నెలల్లోనే రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1982 లో రాష్ట్రపతి పదవినుండి దిగిపోయాక రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుని బెంగుళూరులో స్థిరపడ్డారు. 1996 జూన్ 1 న 83 సంవత్సరాల వయస్సులో నీలం సంజీవరెడ్డి మరణించారు.సంజీవరెడ్డి జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టుకు నీలం సంజీవరెడ్డి పేరు పెట్టబడింది.

నీలం సంజీవరెడ్డి ప్రత్యేకతలు:
  • ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి,
  • లోకసభ స్పీకరుగా పనిచేసిన తొలి తెలుగు వ్యక్తి,
  • 1977లో రాష్ట్రం నుంచి ఎన్నికైన ఏకైక కాంగ్రెసేతర అభ్యర్థి,
  • 1969లో రాష్ట్రపతి పదవికి అధికార పార్టీ తరఫున పోటీచేసి అధికార పార్టీకి మెజారిట్టి ఉండి కూడా ఓడిపోయారు,
  • శ్రీశైలం ప్రాజెక్టుకు సంజీవరెడ్డి పేరు పెట్టబడింది,
  • నీలం సంజీవరెడ్డి మరియు తరిమెల నాగిరెడ్డి ఒకరి సోదరిలను మరొకరు వివాహం చేసుకున్నారు,
  • రెండు సార్లు లోకసభ స్పీకరుగా పనిచేసిన తొలి వ్యక్తి (విరామంతో),
  • రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి పొందిన తొలివ్యక్తి,

హోం,
విభాగాలు: అనంతపురం జిల్లా ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుభారత రాష్ట్రపతులులోకసభ స్పీకర్లుభారతదేశ రాజకీయ నాయకులు,
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగుపెద్దలు (రచన- మల్లాది కృష్ణానంద్),
  • ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమరయోధులు,
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు (రచన- ఆచార్య మారంరాజు సత్యనారాయణరావు),
  • అనంతపురం జిల్లా దర్శిని,
  • ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక సంచికలు,
  • మన రాష్ట్రపతులు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక