29, సెప్టెంబర్ 2014, సోమవారం

అనంతపురం జిల్లా (Ananthapuram Dist)

అనంతపురం జిల్లా
వైశాల్యం19,130 చ.కి.మీ.
జనాభా40,83,315 (2011)
మండలాలు63
అసెంబ్లీ నియోజకవర్గాలు14
అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలలో ఒకటి. ఇది రాష్ట్రంలో అతి పశ్చిమాన ఉన్న జిల్లానే కాకుండా రాష్ట్రంలోనే అతి విస్తీర్ణమైన జిల్లా. లేపాక్షి, పెన్నాఅహోబిలం, పుట్టపర్తి లాంటి అధ్యాత్మిక క్షేత్రాలు జిల్లాలో కలవు. పెన్నానది, చిత్రావతి జిల్లాలో ప్రవహించే ముఖ్యమైన నదులు. రాష్ట్రపతిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి, నాటక ప్రముఖుడు బళ్లారి రాఘవ, భాషావేత్త తిరుమల రామచంద్ర, సమయయోధుడు కల్లూరు సుబ్బారావు, కవిపండితుడు పుట్టపర్తి నారాయణాచార్యులు ఈ జిల్లాకు చెందినవారు.1882లో బళ్లారి జిల్లా నుంచి అవతరించిన అనంతపురం జిల్లా ప్రస్తుత వైశాల్యం 19,130 చ.కి.మీ. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 40,83,315. జిల్లాలో 63 రెవెన్యూ మండలాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణదేవయ విశ్వవిద్యాలయం ఉంది.

భౌగోళికం, సరిహద్దులు:
అనంతపురం జిల్లాకు పశ్చిమాన మరియు దక్షిణాన కర్ణాటక రాష్ట్రం, ఉత్తరాన కర్నూలు జిల్లా, తూర్పున కడప జిల్లా, ఆగ్నేయన చిత్తూరు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 19,130 చదరపు కిలోమీటర్లు. రాయలసీమలో భాగంగా ఉన్న ఈ జిల్లా బంగరు మరియు ఇనుప గనులకు ప్రసిద్ధి. పెన్నా, చిత్రావతి, వేదవతి, పాపాఘ్ని, స్వర్ణముఖి మరియు తడకలేరు నదులు జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో వర్షపాతం చాలా తక్కువ. దేశంలో కరువు జిల్లాలుగా పేరుపొందిన వాటిలో ఇది ఒకటి.

చరిత్ర:
మౌర్యుల కాలంలో ఈ ప్రాంతంలో అందులో భాగంగా ఉండేది. ఆ తర్వాత పల్లవులు, రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యం, మొఘలులు, ఆసఫ్‌జాహీ, నిజాంపాలనలో కొనసాగింది. 1800లో నిజాం నవాబు బ్రిటీష్ వారికి ఇచ్చిన ప్రాంతంలో ఈ జిల్లాప్రాంతం కూడా ఉంది. దాంతో ఇది బ్రిటీష్ పాలనలోకి వెళ్ళింది. బళ్లారి జిల్లాలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం 1882లో ప్రత్యేకంగా జిల్లాగా ఏర్పడింది. మద్రాసు ప్రెసిడెన్సిలో భాగంగా ఉంటూ స్వాతంత్ర్యానంతరం మద్రాసు రాష్ట్రంలోనూ, 1953లో ఆంధ్రరాష్ట్రంలోనూ, 1956 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగానూ ఉంటోంది.

ఇస్కాన్ దేవాలయం
పర్యాటక ప్రాంతాలు:
గుత్తిలో ప్రసిద్ధమైన పురాతన కోట, ఉరవకొండలో అహోబిళం స్వామి ఆలయం, లేపాక్షిలో విజయనగరం కాలం నాటి ఆలయం, పుట్టపర్తిలో ప్రశాంతి నిలయం, కదిరి సమీపంలో తిమ్మమ్మ మర్రిమాను, అనంతపురం సమీపంలో ఇస్కాన్ దేవాలయం,  ఉన్నాయి.

జనాభా:
2011 జనాభా లెక్కల ప్రకారం అనంతపురం జిల్లా జనాభా 40,83,315. దేశంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాలలో 52వ స్థానంలో ఉంది. జనసాంద్రత 213 ఉండగా 2001-11 దశాబ్దిలో పెరుగుదల రేటు 12.16%. స్త్రీ, పురుష నిష్పత్తి 977:1000గా ఉంది. అక్ష్యరాస్యత శాతం 64.28%.


ఇవి కూడా చూడండి:

హోం,
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ జిల్లా వ్యాసాలు, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, 


 = = = = =


4 కామెంట్‌లు:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక