సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఆదిలాబాదు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009 పునర్విభజన ప్రకారం ఇది రాష్ట్రంలోనే తొలి నెంబరు కల నియోజకవర్గం. నియోజకవర్గంలో బంగ్లాదేశ్ కాందీశీకులు అధిక సంఖ్యలో ఉన్నారు. పునర్విభజనకు ముందు నియోజకవర్గం సంఖ్య 246.
ఎన్నికైన శాసనసభ్యులు
నియోజకవర్గ చరిత్ర:
1952లో సిర్పూర్ నియోజకవర్గం ఏర్పడింది. అప్పుడు సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి బుచ్చయ్య విజయం సాధించారు. ఈయన కరీంనగర్ జిల్లా వాసి. 1957లో సిర్పూర్-చెన్నూరు ఉమ్మడి నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన జి.వెంకటస్వామి, రాజమల్లులు గెలుపొందారు. 1967లో కాంగ్రెస్ పార్టీకి చెందిన జి.సంజీవరెడి గెలుపొందారు. 1972లో కేవీ కేశవులు నెగ్గారు. ఈయన కరీంనగర్ జిల్లా ధర్మాపూర్ నివాసి. 1978లో ఈయనే రెండోసారి విజయం సాధించారు. 1983లో తెలుగుదేశం పార్టీ తరఫున కేవీ నారాయణ రావు విజయం సాధించారు. ఈయన గుడివాడలోని కొడాలి ప్రాంతానికి చెందినవారు. 1985లోనూ ఈయనే గెలుపొందారు. 1989లో ఇండిపెండెంటుగా పోటీచేసిన పాల్వాయి పురుషోత్తమరావు విజయం సాధించారు. ఈయన దహెగాం మండలానికి చెందినవారు. 1994లోనూ ఇండిపెండెంటుగా పోటీచేసి రెండోసారి ఈయన విజయం సాధించారు. 1999లో పాల్వాయి పురుషోత్తమరావు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీలో ఉండగా ఎన్నికలకు 3 రోజుల ముందు మావోయిస్టులు హత్యచేశారు. తర్వాత జరిగిన ఎన్నికలలో ఈయన సతీమణి పాల్వాయి రాజ్యలక్ష్మి విజయం సాధించింది. 2004లో కోనేరు కోనప్ప విజయం సాధించారు. ఈయన కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో స్థిరపడ్డను ఇతని తల్లిదండ్రులు కృష్ణా జిల్లా పడమట నుమ్చి వచ్చి కాగజ్ నగర్‌లో స్థిరపడ్డారు. 2009లో కావేటి సమ్మయ్య తెరాస తరఫున విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజీనామా చేయగ 2010లో జరిగిన ఉప ఎన్నికలలో కావేటి సమ్మయ్య మరోసారి తెరాస తరఫున గెలుపొందారు.
2014 ఎన్నికలు: 2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి బహుజన సమాజ్ పార్టీకి చెందిన కోనేరుకోనప్ప తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యపై 8837 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. తర్వాత కోనేరు కోనేప్ప తెరాసలో చేరారు. 2018 ఎన్నికలు: 2018 ఎన్నికలలో తెరాస తరఫున సిటింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, భాజపా తరఫున శ్రీనివాసులు, జనకూటమి తరఫున తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన పాల్వాయి హరీశ్ బాబు చేశారు. తెరాసకు చెందిన కోనేరు కోనప్ప తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పాల్వాయి హరీష్ బాబుపై 24036 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
|
13, మే 2013, సోమవారం
సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ( Sirpur Assembly Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి