13, మే 2013, సోమవారం

బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం (Both Assembly Constituency)

బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం ఆదిలాబాదు జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నాటి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. ఇక్కడి నుంచి గెలుపొందిన తండ్రీకుమారుడు గొడెం రామారావు, గొడెం నగేష్‌లు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 

నియోజకవర్గం పరిధిలోని మండలాలు
 • తాంసీ
 • తలమడుగు
 • గుడిహథ్నూర్
 • ఇచ్చోడ
 • బజార్‌హథ్నూర్
 • బోథ్
 • నేరెడిగొండ

ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 సి.మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆర్.రెడ్డి సీపీఐ
1967 ఎస్.ఏ.దేవ్‌షా కాంగ్రెస్ పార్టీ డి.ఆషారావు సీపీఐ
1972 ఎస్.ఏ.దేవ్‌షా కాంగ్రెస్ పార్టీ ఏ.ఆర్.రావు సీపీఐ
1978 అమర్ సింగ్ కిలావత్ కాంగ్రెస్ పార్టీ గణేష్ జాదవ్ జనతాపార్టీ
1983 ఎ.కాశీరాం కాంగ్రెస్ పార్టీ వి.జి.రెడ్డి సీపీఐ
1985 జి.రామారావు తెలుగుదేశం పార్టీ సి.భీంరావ్ కాంగ్రెస్ పార్టీ
1989 జి.రామారావు తెలుగుదేశం పార్టీ అమర్ సింగ్ కిలావత్ కాంగ్రెస్ పార్టీ
1994 జి.నగేష్ తెలుగుదేశం పార్టీ కె.చౌహాన్
1999 జి.నగేష్ తెలుగుదేశం పార్టీ కె.కోసురావు కాంగ్రెస్ పార్టీ
2004 సోయం బాపురావు తెరాస జి.నగేష్ తెలుగుదేశం పార్టీ
2009 జి.నగేష్ తెలుగుదేశం పార్టీ అనిల్ జాదవ్ కాంగ్రెస్ పార్టీ
2014 రాథోడ్ బాపూరావు తెరాస అనిల్ జాదవ్‌ కాంగ్రెస్ పార్టీ
2018 బాపూరావు రాథోడ్ తెరాస బాపూరావు సోయం కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జి.నగేష్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన అనిల్ జాదవ్ పై 30995 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2009లో జిల్లాలోనే ఇది అత్యధిక మెజారిటీ.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున పోటీచేసిన రాథోడ్ బాపూరావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన అనిల్ జాదవ్‌పై 32993 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున రాథోడ్ బాపురావు, భాజపా తరఫున మడావి రాజు, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన సోయం బాపురావు పోటీచేశారు. తెరాసకు చెందిన బాపూరావు రాథోడ్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన బాపూరావు సోయం పై 6486 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: ఆదిలాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక