ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన టంగుటూరి అంజయ్య ఆగస్టు 16, 1919న జన్మించారు. ఆల్విన్ పరిశ్రమలో కార్మికుడిగా జీవనం ఆరంభించిన అంజయ్య అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
1962లో ముషీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 1967, 1972లలో కూడా గెలుపొందినారు. 1978లో ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీచేసి జనతాపార్టీ అభ్యర్థి ఎన్.నర్సింహారెడ్డి చేతిలో ఓడిపోయారు. 1983లో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి భాజపా అభ్యర్థిపై విజయం సాధించారు. 1984లో సికింద్రాబాదు నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. కేంద్రంలో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కార్మికశాఖ మంత్రిగా నియమితులైనారు. అదేసమయంలో రాష్ట్రంలో మర్రిచెన్నారెడ్డి ప్రభుత్వంలో అసమ్మతి ఉధృతం కావడంతో ఇతన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించారు. అయితే రాష్ట్రంలో ఎలాంటి సొంత గ్రూపులేనందున అందరినీ సంతృప్తి పర్చేందుకు 61 మంత్రులతో జంబోజెట్ మంత్రివర్గాన్ని ఏర్పర్చాల్సి వచ్చింది. 1982 నాటికి అంజయ్య మంత్రివర్గంలో కూడా అసమ్మతి తలెత్తడంతో అధిష్టానం ఈయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలిగించింది. 1984లో మళ్ళీ సికింద్రాబాదు నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. రాజీవ్ గాంధి మంత్రివర్గంలోకూడా అంజయ్య కార్మికశాఖ మంత్రిపదవిని చేపట్టారు. అక్టోబరు 19, 1986న మరణించారు. ఈయన మమరణానంతరం అతని భార్య మణెమ్మ సికింద్రాబాదు నుంచి లోకసభకు ఎన్నికయ్యారు.
= = = = =
|
About Tanguturi Anjaiah in telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి