2, మే 2019, గురువారం

పటాన్‌చెరు మండలం (Patancheru Mandal)

 పటాన్‌చెరు మండలం
జిల్లా సంగారెడ్డి
రెవెన్యూ డివిజన్ సంగారెడ్డి
అసెంబ్లీ నియోజకవర్గంపటాన్‌చెరు
లోకసభ నియోజకవర్గంమెదక్
పటాన్‌చెరు సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. సంగారెడ్డి రెవెన్యూ డివిజన్‌లో భాగంగా ఉన్న ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలున్నాయి. 1984కు ముందు ఈ మండలం సంగారెడ్డి తాలుకాలో భాగంగా ఉండేది. ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన టంగుటూరి అంజయ్య ఈ మండలానికి చెందిన బానూరు గ్రామంలో జన్మించారు. బానూరులో రక్షణ శాఖకు చెందిన బీడీఎల్ పరిశ్రమ,  పాశమైలారంలో పారిశ్రామిక వాడ ఉన్నాయి. ఈ మండలం గ్రేటర్ హైదరాబాదు కార్పోరేషన్‌లో భాగంగా కొనసాగుతోంది. 9వ నెంబరు జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. ఇక్రిసాట్ వ్యవసాయ పరిశొధన సంస్థ కూడా ఈ మండలంలోనే ఉంది. పూనే-విజయవాడ 9వ నెంబరు జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం రుద్రారంలో ఉంది.
మెదక్ జిల్లాలో ఉండిన ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాలో భాగమైంది. అక్టోబరు 11, 2016న పటాన్‌చెరు మండలంలోని 7 గ్రామాలను విడదీసి కొత్తగా అమీన్‌పూర్ మండలాన్ని ఏర్పాటుచేశారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున అమీన్‌పూర్ మండలం, ఈశాన్యాన జిన్నారం మండలం, దక్షిణాన రామచంద్రాపూర్ మండలం, పశ్చిమాన మరియు ఉత్తరాన కంది మండలం, నైరుతిన రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 159109. ఇందులో పురుషులు 81824, మహిళలు 77285. అక్షరాస్యుల సంఖ్య 104450. పట్టణ జనాభా 114500, గ్రామీణ జనాభా 44609. అక్షరాస్యత శాతం 74.76%.

రాజకీయాలు:
ఈ మండలము పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. కేంద్రమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి అంజయ్య ఈ మండలమునకు చెందినవారు.


మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Bachuguda, Bhanur, Chinnakanjerla, Chitkul, Indresham, Inole, Isnapur, Kardanur, Kyasaram, Lakdaram, Muthangi, Nandigaon, Pashamylaram, Patancheru, Patighanpur, Peddakanjerla, Pocharam, Rameshwar Banda, Rudraram,

ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బానురు (Banur):
బానూరు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలమునకు చెందిన గ్రామము. కేంద్రమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి అంజయ్య ఈ గ్రామంలోనే జన్మించారు. గ్రామంలో ప్రముఖమైన బీడీఎల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్) పరిశ్రమ ఉంది.
పటాన్‌చెరు (Patancheru):
పటాన్‌చెరు సంగారెడ్డి జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. మండల వ్యవస్థకు పూర్వం ఇది సంగారెడ్డి తాలుకాలో భాగంగా ఉండేది. ఈ గ్రామం 17'32" ఉత్తర అక్షాంశం 78'16" తూర్పు రేఖాంశంపై ఉంది. హైదరాబాదు నుంచి 32 కిమీ దూరంలో పూనె-విజయవాడ జాతీయ రహదారిపై ఉంది. ఇక్కడ పురాతనకాలం నాటి దేవాలయాలు ఉన్నాయి. జైన తీర్థంకరుల విగ్రహాలు కూడా గ్రామంలో ఉన్నాయి. ఇక్కడ ఒకప్పుడు జైనమతం విలసిల్లినట్లు తెలుస్తోంది. చరిత్రలో పొట్లచెరుగా పిల్వబడీన గ్రామం ఇదే. ఇది కొంతకాలం బీదర్ డివిజన్ సుబేదారు ప్రధాన కేంద్రంగా ఉండింది. ఆ తర్వాత గుల్హనాబాదు-మెదక్ డివిజన్ కేంద్రంగా కొనసాగింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాదులోని 150 డివిజన్లలో ఇది ఒకటిగా కొనసాగుతున్నది. 
రుద్రారం (Rudraram):
రుద్రారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలమునకు చెందిన గ్రామం. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఈ గ్రామంలో ఉంది.


ఇవి కూడా చూడండి:
  • టంగుటూరి అంజయ్య,
  • పటాన్‌చెరు పారిశ్రామికవాడ,
  • గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం,
  • భారత్ డైనమిక్స్ లిమిటెడ్,

ఫోటో గ్యాలరీ
టంగుటూరి అంజయ్య
రుద్రారంలోని గీతం (GITAM)
విశ్వవిద్యాలయం
c c


హోం
విభాగాలు: సంగారెడ్డి జిల్లా మండలాలు,  పటాన్‌చెరు మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Medak Dist, 2016,
  • Handbook of Census Statistics, Medak District, 2011,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 239 తేది: 11-10-2016 
  • మెదక్ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర 
  • సంగారెడ్డి జిల్లా అధికారిక వెబ్‌సైట్ (https://sangareddy.telangana.gov.in/te/) 


About Patancheru Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక