20, జూన్ 2013, గురువారం

అనకాపల్లి మండలము (Anakapalli Mandal)

జిల్లా విశాఖపట్టణం
జనాభా 176822 (2001)
187272 (2011)
రెవెన్యూ డివిజన్అనకాపల్లి
అసెంబ్లీ నియోజకవర్గంఅనకాపల్లి
లోకసభ  నియోజకవర్గంఅనకాపల్లి
పర్యాటకక్షేత్రాలుబొజ్జన్నకొండ


అనకాపల్లి విశాఖపట్టణం జిల్లాకు చెందిన మండలము. మండల కేంద్రము అనకాపల్లి చారిత్రాత్మక పట్టణము. ఇది బెల్లం వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన పట్టణము. అసెంబ్లీ మరియు లోకసభ నియోజకవర్గాల కేంద్రముగా ఉన్నది. జూన్ 21, 2013న అనకాపల్లి కేంద్రంగా కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయబడింది. ఇంతకు ముందు విశాఖపట్టణం రెవెన్యూ డివిజన్‌లో భాగంగా ఉండేది. మండల కేంద్రంలో ప్రాచీనమైన నూకాంబిక ఆలయం ఉంది. తుమ్మపాల గ్రామంలో చక్కెర కర్మాగారం ఉంది. మండలం గుండా శారదానది ప్రవహిస్తోంది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 187272. మండల కేంద్రం అనకాపల్లి పురపాలక సంఘంగా ఉన్నది. పుడిమడలలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించనున్నారు.

భౌగోళికం, సరిహద్దులు:
అనకాపల్లి మండలమునకు ఉత్తరాన చోడవరం మండలం, ఈశాన్యాన సబ్బవరం మండలం, తూర్పున పరవాడ మండలం, దక్షిణమున మునగపాక మండలం, పశ్చిమాన కాసింకోట మరియు బుచ్చయ్యపేట మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 176822. ఇందులో పురుషులు 88044, మహిళలు 88778.గృహాలసంఖ్య 40754.
2011 నాటికి మండల జనాభా పదేళ్ళ కాలంలో 6% పెరిగి 187272కు చేరింది. ఇందులో పురుషులు 93206, మహిళలు 94066. పట్టణ జనాభా 91615, గ్రామీణ జనాభా 42725.

చరిత్ర:
ప్రాచీన కాలంలో ఈ ప్రాంతంలో బౌద్ధమతం ప్రాబల్యం ఉండేది. అనకాపల్లి సమీపంలో బొజ్జన్నకొండపై బౌద్ధారామం ఇప్పటికీ సందర్శనయోగ్యంగా ఉన్నది. అనంతరం ఈ ప్రాంతాన్ని కళింగరాజ్యంలో భాగంగా మారింది. చేది, తూర్పుగాంగులు, గజపతులు, కాకతీయులు, కుతుబ్‌షాహీలు ఈ ప్రాంతాన్ని పాలించారు. క్రీ.శ.1450 ప్రాంతంలో అప్పలరాజు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నప్పుడు అనకాపల్లిని కేంద్రంగా చేసుకున్నాడు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఈ ప్రాంతం నుంచి అనేక యోధులు పోరాటం సాగించారు. గాంధీమహాత్ముడు కూడా ఈ ప్రాంతాన్ని అనేక సార్లు సందర్శించాడు. 

రాజకీయాలు:
ఈ మండలము అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మరియు అనకాపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.

రవాణా సౌకర్యాలు:
కోల్కత-చెన్నై జాతీయ రహదారి అనకాపల్లి పట్టణం గుండా వెళ్ళుచున్నది. ప్రధాన పట్టణాల నుంచి అనకాపల్లికి రహదారులున్నాయి. కొల్కత-చెన్నై రైలుమార్గం కూడా అనకాపల్లిపై నుంచి వెళ్ళుచున్నది.

పర్యాటకక్షేత్రాలు:
అనకాపల్లి సమీపంలో బొజ్జన్నకొండ బౌద్ధారామం ఉంది. ఇది పర్యాటకక్షేత్రంగా విరాజిల్లుతోంది. పట్టణం సమీపంలో కొండమీద సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది. కొండపై నుంచి కనిపించే సుందరదృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
  ఇవి కూడా చూడండి:
  1. అనకాపల్లి రైల్వేస్టేషన్,
  2. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం,
  3. అనకాపల్లి లోకసభ నియోజకవర్గం,
  4. బొజ్జన్నకొండ బౌద్ధారామం,
  5. శారదానది,
  6. అనకాపల్లి బెల్లం మార్కెట్,
  7. నూకాలమ్మ ఆలయం, 
  8. నూకల చినసత్యనారాయణ,


విభాగాలు: విశాఖపట్టణం జిల్లా మండలాలు, అనకాపల్లి రెవెన్యూ డివిజన్, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక