13, జూన్ 2013, గురువారం

కాకినాడ లోకసభ నియోజకవర్గం (Kakinada Loksabha Constituency)

కాకినాడ లోకసభ నియోజకవర్గం
జిల్లాతూర్పు గోదావరి జిల్లా
ప్రస్తుత ఎంపివంగా గీతా విశ్వనాథ్
పార్టీవైకాపా


ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజక వర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా జనరల్ స్థానాలుగానే ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన వంగా గీతా విశ్వనాథ్ ఎన్నికయ్యారు.

ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారికి కేంద్రంలో మంత్రిపదవులు కూడా చాలా సార్లు లభించాయి. గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచిన యు.వి.కృష్ణంరాజు మంత్రిపదవిని పొందగా, రామసంజీవరావు కేంద్ర కమ్యునికేషన్ శాఖా మంత్రిగా పనిచేశారు. రామసంజీవరావు కుమారుడైన పళ్ళంరాజు కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

  1. తుని అసెంబ్లీ నియోజకవర్గం
  2. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం
  3. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం
  4. కాకినాడ గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం
  5. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం
  6. కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం
  7. జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1వ 1952-57 చెలికాని వెంకట రామారావు సీపీఐ
2వ 1957-62 బి. ఎస్. మూర్తి
మొసలికంటి తిరుమలరావు
కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ
3వ 1962-67 మొసలికంటి తిరుమలరావు కాంగ్రెస్ పార్టీ
4వ 1967-71 మొసలికంటి తిరుమలరావు కాంగ్రెస్ పార్టీ
5వ 1971-77 మల్లిపూడి శ్రీరామ సంజీవరావు కాంగ్రెస్ పార్టీ
6వ 1977-80 మల్లిపూడి శ్రీరామ సంజీవరావు కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 మల్లిపూడి శ్రీరామ సంజీవరావు కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 తోట గోపాలకృష్ణ తెలుగుదేశం పార్టీ
9వ 1989-91 ఎం.ఎం.పళ్ళంరాజు కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 తోట సుబ్బారావు తెలుగుదేశం పార్టీ
11వ 1996-98 తోట సుబ్బారావు తెలుగుదేశం పార్టీ
12వ 1998-99 ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు భారతీయ జనతా పార్టీ
13వ 1999-04 ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీ
14వ 2004-09 ఎం.ఎం.పళ్ళంరాజు కాంగ్రెస్ పార్టీ
15వ 2009-14 ఎం.ఎం.పళ్ళంరాజు కాంగ్రెస్ పార్టీ
16వ 2014-19 తోట నర్సింహ తెలుగుదేశం పార్టీ
17వ 2019- వంగా గీతా విశ్వనాథ్ వైకాపా

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.ఎం.పల్లంరాజు తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీకి చెందిన చలమలశెట్టి సునీల్‌పై 34,044 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. పల్లంరాజుకు 323607 ఓట్లు రాగా, సునీల్‌కు 289563 ఓట్లు లభించాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వి.సత్య 3వ స్థానంలో, లోక్‌సత్తా అభ్యర్థి ఎ.విజయలక్ష్మి 4వ స్థానంలో నిలిచారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన వంగా గీతా విశ్వనాథ్ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన చలమలశెట్టు సునీల్ పై 25,738 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 537,630 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 511,892 ఓట్లు లభించాయి. 


హోం,
విభాగాలు: తూర్పు గోదావరి జిల్లా నియోజకవర్గాలు, కాకినాడ లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక