13, జూన్ 2013, గురువారం

కరీంనగర్ లోకసభ నియోజకవర్గం (Karimnagar Loksabha Constituency)

కరీంనగర్ లోకసభ నియోజకవర్గం
జిల్లాకరీంనగర్
ప్రస్తుత ఎంపిబోయినపల్లి వినోద్
పార్టీతెలంగాణ రాష్ట్ర సమితి


తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. సీహెచ్ విద్యాసాగర్ రావు, కె.చంద్రశేఖర్ రావులు కేంద్రమంత్రులుగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2014లో జరిగిన 16వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన బోయినపల్లి వినోద్  ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
  1. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం,
  2. చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ),
  3. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం
  4. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం
  5. మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)
  6. హుజురాబాదు అసెంబ్లీ నియోజకవర్గం
  7. హుస్నాబాదు అసెంబ్లీ నియోజకవర్గం


ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1వ 1952-57 బద్దం ఎల్లారెడ్డి
ఎం.ఆర్.కృష్ణ
పి.డి.ఫ్
ఎస్.సి.ఎఫ్
2వ 1957-62 ఎం.ఆర్.కృష్ణ
ఎం.శ్రీరంగారావు
కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ
3వ 1962-67 జె.రమాపతిరావు కాంగ్రెస్ పార్టీ
4వ 1967-71 జె.రమాపతిరావు కాంగ్రెస్ పార్టీ
5వ 1971-77 ఎం.సత్యనారాయణ రావు
6వ 1977-80 ఎం.సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 ఎం.సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 జువ్వాది చొక్కారావు కాంగ్రెస్ పార్టీ
9వ 1989-91 జువ్వాది చొక్కారావు కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 జువ్వాది చొక్కారావు కాంగ్రెస్ పార్టీ
11వ 1996-98 ఎల్.రమణ తెలుగుదేశం పార్టీ
12వ 1998-99 సీహెచ్.విద్యాసాగర్ రావు భారతీయ జనతా పార్టీ
13వ 1999-04 సీహెచ్.విద్యాసాగర్ రావు భారతీయ జనతా పార్టీ
14వ 2004-06 కె.చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి
(ఉప ఎన్నిక) 2006-08 కె.చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి
(ఉప ఎన్నిక) 2008-09 కె.చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి
15వ 2009-14 పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ
16వ 2014- బోయినపల్లి వినోద్ తెలంగాణ రాష్ట్ర సమితి

2004 ఎన్నికలు:
2004 లో జరిగిన 14వ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితితోనూ, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతోనూ పొత్తు కుదుర్చుకున్నందున తెరాస తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, భాజపా తరఫున సి.హెచ్.విద్యాసాగర్ రావులు పోటీపడ్డారు. హోరాహోరీగా జరిగిన పోరులో కె.చంద్రశేఖరరావు 1,31,168 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇంతకు క్రితం రెండు సార్లు విజయం సాధించిన విద్యాసాగర్ రావుకు రెండో స్థానం లభించింది.

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పొన్నం ప్రభాకర్, ప్రజారాజ్యం పార్టీ తరఫున వెలిచాల రాజేందర్ మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన బి.వినోద్ కుమార్ పోటీచేశారు. తొలుత కె.చంద్రశేఖరరావు కుమారుడు కె.తారక రామారావును ఇక్కడి నుండి పోటీ చేయించాలనుకున్ననూ చివరి దశలో సిరిసిల్ల అసెంబ్లీ టికెట్టు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన బి.వినోద్ కుమార్ పై 50243 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పొన్నం ప్రభాకర్‌కు 317927 ఓట్లు రాగా, వినోద్ కుమార్‌కు 267684 ఓట్లు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వి.రాజేంద్రప్రసాద్ 3వ స్థానంలో, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీహెచ్ జంగారెడ్డి 4వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 20 అభ్యర్థులు నామినేషన్ వేయగా 2 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. ఒకరు నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నారు. తుదిబరిలో 17 అభ్యర్థులు మిగిలారు. తెరాస అభ్యర్థి బోయినపల్లి వినోద్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎంపి అయిన పొన్నం ప్రభాకర్‌పై 204652 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: కరీంనగర్ జిల్లా నియోజకవర్గాలు, కరీంనగర్ లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక