18, జూన్ 2013, మంగళవారం

కావూరి సాంబశివరావు (Kavuri Sambashiva Rao)

 కావూరి సాంబశివరావు
జననంఅక్టోబరు 2, 1943
జిల్లాకృష్ణా
పదవులు5 సార్లు ఎంపి, కేంద్రమంత్రి
నియోజకవర్గంమచిలీపట్నం, ఏలూరు,
కావూరి సాంబశివరావు కృష్ణా జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. అక్టోబరు 2, 1943న కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం దోసపాడులో జన్మించిన సాంబశివరావు బి.ఈ.అభ్యసించారు. రాజకీయాలలో ప్రవేశించి 1984లో తొలిసారి 8వ లోకసభకు మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989, 1998లలో మచిలీపట్నం నుంచి, 2004, 2009లలో ఏలూరు లోకసభ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. 1989-94 కాలంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా, 1998లో పీసిసి ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 2013, జూన్ 16న సీడబ్ల్యుసి శాశ్వత ఆహ్వానితునిగా, జూన్ 17న కేంద్ర జౌళిశాఖ కేబినెట్ మంత్రిగా నియమించబడ్డారు.

రాజకీయ ప్రస్థానం:
1984లో మచిలీపట్నం లోకసభకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి తెదేపాకు చెందిన వడ్డే రంగారావుపై విజయం సాధించారు. 1989లో మచిలీపట్నం నుంచే పోటిచేసి తెదేపాకు చెందిన గంగాధర చౌదరిపై విజయం సాధించారు. 1991లో తెదేపా అభ్యర్థి కె.పి.రెడ్డయ్య చేతిలో పరాజయం పొందారు. 1998లో తెదేపాకు చెందిన కైకాల సత్యనారాయణపై గెలుపొంది 3వ సారి లోకసభకు ఎన్నికయ్యారు. 2004లో ఏలూరు నుంచి పోటీచేసి తెదేపా అభ్యర్థి బోళ్ల బులిరామయ్యపై, 2009లో కూడా ఏలూరి నుంచి పోటీచేసి మాగంటిబాబుపై విజయం సాధించారు. 

విభాగాలు: కృష్ణా జిల్లా రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం, ఏలూరు లోకసభ నియోజకవర్గం, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక