14, జూన్ 2013, శుక్రవారం

ఖమ్మం లోకసభ నియోజకవర్గం (Khammam Loksabha Constituency)

ఖమ్మం లోకసభ నియోజకవర్గం
జిల్లాఖమ్మం
ప్రస్తుత ఎంపినామా నాగేశ్వరరావు
పార్టీతెరాస


తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెరాసకు చెందిన నామా నాగేశ్వరరావు ఎన్నికయ్యారు.

నియోజకవర్గ చరిత్ర:
ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరుగగా 11 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తొలి 2 ఎన్నికలలో పీడీఎఫ్ విజయం సాధించగా ఆ తర్వాత వరుసగా 8 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందినారు. 1996లో సీపీఐ ఆ తర్వాత మళ్ళీ వరుసగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2009లో తెలుగుదేశం పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసింది. 2014లో వైకాపా అభ్యర్థి విజయం సాధించారు.

కేంద్రమంత్రులు:
ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఇద్దరు కేంద్రంలో మంత్రిపదవులు పొందారు. 1991లో విజయం సాధించిన పి.వి.రంగయ్యనాయుడు పి.వి.నరసింహరావు మంత్రివర్గంలో కేంద్రమంత్రిపదవి నిర్వహించగా 2004లో ఇక్కడి నుంచి గెలుపొందిన రేణుకాచౌదరి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో స్థానం పొందారు. అంతేకాకుండా ఈ నియోజవర్గం నుంచి లోక్‌సభ సభ్యులుగా ఎన్నికైన జగలం వెంగళరావు, నాదెండ్ల భాస్కరరావులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు.



దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1వ 1952-57 టి.బి.విఠల్ రావు పీడీఎఫ్
2వ 1957-62 టి.బి.విఠల్ రావు పీడీఎఫ్
3వ 1962-67 తేళ్ల లక్ష్మీకాంతమ్మ కాంగ్రెస్ పార్టీ
4వ 1967-71 తేళ్ల లక్ష్మీకాంతమ్మ కాంగ్రెస్ పార్టీ
5వ 1971-77 తేళ్ల లక్ష్మీకాంతమ్మ కాంగ్రెస్ పార్టీ
6వ 1977-80 జలగం కొండలరావు కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 జలగం కొండలరావు కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 జలగం వెంగళరావు కాంగ్రెస్ పార్టీ
9వ 1989-91 జలగం వెంగళరావు కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 పి.వి.రంగయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీ
11వ 1996-98 తమ్మినేని వీరభద్రం సీపీఎం
12వ 1998-99 నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ పార్టీ
13వ 1999-04 రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీ
14వ 2004-09 రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీ
15వ 2009-14 నామా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
16వ 2014-19 శ్రీనివాస్ రెడ్డి వైకాపా
17వ 2019- నామా నాగేశ్వరరావు తెరాస


2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన నామా నాగేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరిని 124448 ఓట్ల తేడాతో ఓడించారు. నామా నాగేశ్వరరావుకు 469368 ఓట్లు రాగా, రేణుకాచౌదరికి 344920 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి జె.హేమమాలిని 3వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 27 అభ్యర్థులు పోటీచేశారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన శ్రీనివాస్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎంపి అయిన నామా నాగేశ్వరరావుపై 10162 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి లోకసభలో ప్రవేశించారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన నామా నాగేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన రేణుకా చౌదరిపై 168062 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెరాస అభ్యర్థికి 567459 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 399397 ఓట్లు లభించాయి. సీపీఎంకు చెందిన బోడ వెంకట్ 57,102 ఓట్లతో మూడోస్థానంలో, భాజపాకు చెందిన దేవకి వాసుదేవరావు 20,488 ఓట్లతో నాలుగో స్థానంలో, జనసేనకు చెందిన నారాల సత్యనారాయణ 19,315 ఓట్లతో ఐదోస్థానంలో నిలిచారు.
 



విభాగాలు: ఖమ్మం జిల్లా నియోజకవర్గాలు, ఖమ్మం లోకసభ నియోజకవర్గం, తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాలు,




 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక