20వ శతాబ్దంలో తెలుగు సాహితీరంగంలో తనదైన ముద్ర వేసిన శ్రీరంగం శ్రీనివాసరావు జనవరి 2, 1910న విశాఖపట్టణంలో జన్మించారు. చిన్న వయస్సులో ఉన్నప్పుడే తల్లి మరణించింది. ఒంటరిగా ఉంటూ పాఠశాల దశలోనే పద్యాలు రాస్తూ, నాటకాలు వేస్తూ జీవనం గడిపారు. 1926లో కవితా సమితిని స్థాపించారు. డిగ్రీ అభ్యసన దశలో బీదరికం అనుభవించినట్లు స్వయంగా చెప్పుకున్నారు. 1929లో వెంకట రమణమ్మతో వివాహం జరిగింది. తర్వాత సరోజినీతో రెండో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కూతుళ్ళు, ఒక కుమారుడు.
చిన్న వయస్సులోనే రచనలు చేపట్టిన శ్రీశ్రీ 18వ ఏట "ప్రభవ" అనే కావ్యసంపుటిని ప్రచురించారు. శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం, మరోప్రపంచం, అనంతం లాంటి రచనలు ఆయనకు ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. 1938లో ఆంధ్రప్రభ దినపత్రిక సహాయ సంపాదకుడిగా చేరారు. 1948లో సినీరంగంలో ప్రవేశించి, తెలుగు పాటలతో సినీప్రేక్షకులను మైమరిపించారు. సిరిసిరిమువ్వ, ప్రాసలీలలు, లిమరిక్కులు 3 రచలు కలిపి సిప్రాలిగా ప్రచురించారు. నిరాశ, ఒంటరితనం, బాధలు తన రచనల్లో ప్రస్పుటంగా కనిపిస్తాయి. విమర్శకులకు విమర్శలతోనే సమాధానం ఇవ్వగలిగే చరురత ఇతనిలో కనిపిస్తుంది. ఉద్యమాలు, కమ్యూనిజం భావాల వైపు మొగ్గినట్లు అతని రచనలు స్పష్టికరిస్తాయి. కులాల జోలికి మాత్రం ఇతను వెళ్ళలేరు. అలాగే సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచారు. కాదేదీ కవిత కనర్హం అని చెప్పిననూ శ్రామికవర్గ సంబంధాలు, రాజ్యహింస, ఉద్యమాలపైనే అధిక రచనలు కొససాగించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి "రాజా లక్ష్మీ ఫౌండేషను" అవార్డు, సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డులు, నేషనల్ ఫిలిం అవార్డు, నంది అవార్డు లాంటి ఎన్నో పురస్కారాలు పొందిన మహాకవి జూన్ 15, 1983న అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. (* గమనిక: శ్రీశ్రీ ఏప్రిల్‌లో జన్మించినట్లు తన "అనంతం"లో పేర్కొన్నారు. కాని రికార్డుల్లో మాత్రం జనవరి అనే ఉంది).
= = = = =
|
14, జూన్ 2013, శుక్రవారం
శ్రీశ్రీ (Sri Sri)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
chala baagundi, Sri Sri gaari kosam telsuko galiganu. Yedi yemaina, Kavulaku vunna Kyati yevvariki ledu, radu.
రిప్లయితొలగించండి