14, జూన్ 2013, శుక్రవారం

జహీరాబాదు లోకసభ నియోజకవర్గం (Zahirabad Loksabha Constituency)

జహీరాబాదు లోకసభ నియోజకవర్గం
జిల్లామెదక్, నిజామాబాదు
ప్రస్తుత ఎంపిబి.బి.పాటిల్
పార్టీతెలంగాణ రాష్ట్ర సమితి


తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో మెదక్, నిజామాబాదు జిల్లాలకు చెందిన 7 అసెంబ్లీ నియోజక వర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన బి.బి.పాటిల్ ఎన్నికయ్యారు.


దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
  1. జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)
  2. బాన్స్‌వాడ అసెంబ్లీ నియోజకవర్గం
  3. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం
  4. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం
  5. నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం
  6. ఆంధోల్ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)
  7. జహీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
15వ 2009-14 సురేష్ కుమార్ షేట్కర్ కాంగ్రెస్ పార్టీ
16వ 2014-19 బి.బి.పాటిల్ తెలంగాణ రాష్ట్ర సమితి
17వ 2019- బి.బి.పాటిల్ తెలంగాణ రాష్ట్ర సమితి

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవరం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ తన సమీప ప్రత్యర్థి మహాకూటమి తరఫున పోటీచేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి సయ్యద్ యూసుఫ్ అలీపై 17407 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. సురేష్ షేట్కార్‌కు 395767 ఓట్లు రాగా, యూసుఫ్ అలీకి 378360 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఎం.శివకుమార్ 3వ స్థానంలో, భాజపా అభ్యర్థి సీహెచ్ భాగ్యన్న 4వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 15 అభ్యర్థులు నామినేషన్ వేయగా 2 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. ముగ్గురు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. తుదిబరిలో 10 అభ్యర్థులు మిగిలారు. తెరాస అభ్యర్థి బీబీ పాటిల్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎంపి అయిన సురేష్ షెట్కార్‌పై 142000 ఓట్ల మెజారిటితో విజయం సాధించి తొలిసారి లోకసభకు ఎన్నికైనారు.

2019 ఎన్నికలు:
2019లో జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన సిటింగ్ ఎంపీ బీబీ పాటిల్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మదన్ మోహన్ రావుపై 6229 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. తెరాస అభ్యర్థికి 434244 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 428016 ఓట్లు లభించాయి. భాజపాకు చెందిన బాణాల లక్ష్మారెడ్డి 1,38,947 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.


హోం,
విభాగాలు: జహీరాబాదు లోకసభ నియోజకవర్గం, తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాలు,
 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక