14, జూన్ 2013, శుక్రవారం

చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం (Chevella Loksabha Constituency)

చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం
జిల్లారంగారెడ్డి జిల్లా
ప్రస్తుత ఎంపివిశ్వేశ్వర్ రెడ్డి
పార్టీతెలంగాణ రాష్ట్ర సమితి


తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో రంగారెడ్డి రెడ్డి జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2008లో జరిగిన నియీజకవర్గాల పునర్విభజనలో ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. 2014లో జరిగిన 16వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
 1. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం,
 2. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం,
 3. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
 4. చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం
 5. పరిగి అసెంబ్లీ నియోజకవర్గం
 6. వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)
 7. తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం


ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
15వ 2009-14 ఎస్.జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
16వ 2014- విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి


2009 ఎన్నికలు
2009లో జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సూదిని జైపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన జితేందర్ రెడ్డిపై 18,532 ఓట్ళ మెజారిటీతో గెలుపొందినారు. వీరిరువుతూ పొరుగున ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా వాసులే కాకుండా గతంలో వేర్వేరు నియోజకవర్గాల నుంచి లోకసభకు ఎన్నికైనవారే. జైపాల్ రెడ్డికి 420807 ఓట్లు లభించగా, జితేందర్ రెడ్డికి 402275 ఓట్లు పోలయ్యాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బద్దం బాల్‌రెడ్డి 3వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 24 అభ్యర్థులు నామినేషన్లు వేయగా 4 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. 5గురు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. తుదిబరిలో 15 అభ్యర్థులు మిగిలారు. తెరాసకు చెందిన విశ్వేశ్వర్ రెడ్డి, తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్తీక్ రెడ్డిపై 70209 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు.


విభాగాలు: రంగారెడ్డి జిల్లా నియోజకవర్గాలు, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక