బెల్లంపల్లి మంచిర్యాల జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము 19° 03' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 28' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. మండలంలో బొగ్గు నిల్వలు అధికంగా ఉన్నాయి. ఈ మండలము బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలానికి చెందిన చంద్రవెల్లి పంచాయతికి 2007లో నిర్మల్ పురస్కారం లభించింది. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 17 గ్రామపంచాయతీలు, 13 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం గుండా రైల్వేలైన్ వెళ్ళుచున్నది. బెల్లంపల్లికి సమీపంలోని శ్రీబుగ్గా రాజేశ్వరస్వామి మందిరం ప్రసిద్ధి చెందినది. లింగాపుర్ శివాలయం పురాతనమైనది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వూవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాలో భాగంగా మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన తాండూరు మండలం, ఈశాన్యాన కన్నేపల్లి మండలం, తూర్పున నెన్నెల్ మండలం, దక్షిణాన మందమర్రి మండలం, పశ్చిమాన కాసిపేట మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2009కి పూర్వం ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేది. 1978 నుంచి 2004 వరకు ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి ఎనికైన వారు బెల్లంపల్లికి చెందినవారే. రవాణా సౌకర్యాలు: కాజీపేట- బల్హర్షా రైల్వేలైను మండలం మీదుగా వెళ్ళుచున్నది. బెల్లంపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది. మంచిర్యాల నుంచి ఆసిఫాబాదు వెళ్ళు ప్రధాన రహదారి మండలం గుండా వెళ్తుంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 94070. ఇందులో పురుషులు 47701, మహిళలు 46369. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 81467. ఇందులో పురుషులు 40999, మహిళలు 40468. పట్టణ జనాభా 54445 కాగా గ్రామీణ జనాభా 27022.
బెల్లంపల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Akenipalle, Ankusam, Batwanpalle, Bellampalle, Budha Kalan (R), Budha Khurd (R), Chakepalle, Chandravelli, Dugnepalle, Gurjal (R) @ Talla Gurjal, Kannal (R), Perkapalle, Rangapet
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బెల్లంపల్లి (Bellampally): బెల్లంపల్లి మంచిర్యాల జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. పట్టణానికి రైలు సదుపాయం ఉంది. జిల్లాలోనే తొలి బొగ్గు గని బెల్లంపల్లిలో 1929లో ప్రారంభించారు. 6 కిమీ దూరంలో అటవీ ప్రాంతంలో 2 గుట్టల మధ్యన బుగ్గ శివాలయం ఉంది. ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మితమైంది. చంద్రవెల్లి (Chandravelli): చంద్రవెల్లి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలానికి చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఈ పంచాయతికి 2007లో నిర్మల్ పురస్కారం లభించింది. కన్నాల (Kannala): కన్నాల మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలమునకు చెందిన గ్రామము. కన్నాల గ్రామపంచాయతి పరిధిలో బగ్గు అటవీప్రాంతంలో బుగ్గారాజేశ్వరస్వామి ఆలయం ఉంది. నాగుపాము నిత్యం కోనేరులో స్నానమాచరించి శివుడిని భక్తినిప్రార్థిస్తుండేదని గోండుల కథనం. ఆలయం బెల్లంపల్లి నుంచి 7 కిమీ దూరంలో ఉంది. 2014, జూన్ 21న కన్నాల పంచాయతి సర్పంచి మందరవి దారుణ హత్యకు గురయ్యారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Bellampalli Mandal, Mancherial Manchiryal Dist (district) Mandal in telugu, Mancherial Manchiryal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి