భీమారం మంచిర్యాల జిల్లాకు చెందిన మండలము. మండలంలో 4 ఎంపీటీసి స్థానాలు, 11 గ్రామపంచాయతీలు, 12 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలము దక్షిణ సరిహద్దులో గోదావరి నది ప్రవహిస్తుంది. ఇందారం, భీమారంలు మండలంలోని పెద్ద గ్రామాలు. మండలం గుండా నిజామాబాదు-జగదల్‌పూర్ జాతీయ రహదారి వెళ్ళుచున్నది. లోకసభ సభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన చెరుకు మాధవరెడ్డి ఈ మండలమునకు చెందినవారు.
అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అంతకుక్రితం ఆదిలాబాదు జిల్లాలో, మంచిర్యాల మండలంలో ఈ గ్రామాలు భాగంగా ఉండేవి. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన నెన్నెల్ మండలం, తూర్పున మరియు దక్షిణాన చెన్నూర్ మండలం, పశ్చిమాన జైపూర్ మండలం, వాయువ్యాన కొంతవరకు మందమర్రి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2014లో ఎంపీపీగా మెండె హేమలత, జడ్పీటీసిగా జర్పుల రాజ్‌కుమార్ నాయక్ ఎన్నికయ్యారు. ఖనిజ నిల్వలు: మండలంలో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి.
భీమారం మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ankushapur, Arepalle, Arkepelly (D), Bheemaram, Burugupalle, Dampur, Kothapalle, Maddikal, Polampalle, Pothanpalle, Reddipalle, Vellapelly (D)
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఆరేపల్లి (Arepaly): ఆరేపల్లి మంచిర్యాల జిల్లా భీమారం మండలమునకు చెందిన గ్రామము. లోకసభ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన చెరుకు మాధవరెడ్డి స్వగ్రామం.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Bheemaram Mandal, Mancherial Manchiryal Dist (district) Mandal in telugu, Mancherial Manchiryal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి