చెన్నూరు మంచిర్యాల జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము 18° 46' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 45' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. దక్షిణ మరియు ఆగ్నేయ సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తుంది. అభినవ పోతనగా పేరుగాంచిన వానమామలై వరదాచార్య ఉద్యోగరీత్యా చేన్నూరులో స్థిరపడి సాహితీసేవ చేశారు. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 30 గ్రామపంచాయతీలు, 30 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం గుండా నిజామాబాదు-జగదల్‌పూర్ జాతీయ రహదారి వెళ్ళుచున్నది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వూవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాలో భాగంగా మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన నెన్నెల్ మండలం మరియు కోటపల్లి మండలం, పశ్చిమాన భీమారం మండలం మరియు జైపూర్ మండలం, తూర్పున మరియు దక్షిణాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. చరిత్ర: చెన్నూరు చారిత్రక ప్రాశస్త్యం కల ప్రాంతం. అగస్త్యముని తపస్సు చేసిన ప్రాంతంగా, ఆ ముని ద్వారా లింగస్థాపన జరిగిన అగస్తేశ్వరాలయం పురాణకాలం నుంచి ప్రసిద్ధి చెందింది. 1947-48లో కొమ్మెర నారాయణ, గౌతం కాంతయ్య, గన్ను నారాయణ, మారేపల్లి రాంకిషన్ రావు, కొమ్మెర సాంబయ్య, పెండ్యాల సమ్మయ్య తదితరులు నిజాం వ్యతిరేక ఉద్యమంలో పోరాడారు. సెప్టెంబరు 17, 1948న నిజాంరాజ్యం భారత యూనియన్‌లో విలీనంలో ఈ ప్రాంతం 1956 వరౌ హైదరాబాదు రాష్ట్రంలోనూ, 1956-2014 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగి జూన్ 2, 2014న కొత్తగా అవతరించిన తెలంగాణలో భాగమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు 1969లో మరియు 2009-14 కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. 2011లో మండలంలో మొత్తం సకలజనుల సమ్మె విజయవంతమైంది. మండలానికి చెందిన పలువురు ప్రముఖుకు తెలంగాన ఉద్యమంలో పాల్గొన్నారు. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఆదిలాబాదు జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాలో భాగమైంది. రాజకీయాలు: ఈ మండలము చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. చెన్నూరు నుంచి గెలుపొందిన జి.వినోద్ కార్మికశాఖ మంత్రి పదవి పొందారు. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 51365. ఇందులో పురుషులు 25744, మహిళలు 25621. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 51335. ఇందులో పురుషులు 25685, మహిళలు 25650. పట్టణ జనాభా 20232 కాగా గ్రామీణ జనాభా 31103. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Akkapalle, Angarajpalle, Asnad, Beervelli, Bhamraopet, Buddaram, Chakepalle, Chennur, Chintapalle, Dugnepalle, Gangaram, Kachanpalle, Kannepalle, Kathersala, Khambojipet, Kistampet, Kommera, Lingampalle, Nagapur, Narasakkapet, Narayanpur, Pokkur, Ponnaram, Raipet, Sankaram, Shivalingapur, Somanpalle, Suddal, Sundersala, Yellakkapet
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
చెన్నూరు (Chennurl): చెన్నూరు మంచిర్యాల జిల్లాకు చెందిన పట్టణం మరియు మండల కేంద్రము. ఇది మంచిర్యాల నుంచి 40 కిమీ దూరంలో ఉంది. చెన్నూరు 1986కు ముందు తాలుకా కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం ఇది అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం. చెన్నూరు పట్టణం గుండా బతుకమ్మ వాగు ప్రవహిస్తోంది. ఇది 16వ నెంబరు జాతీయ రహదారిపై ఉంది. ఇది చారిత్రక పాశస్త్యం కల ప్రాంతం. ప్రముఖ పంచాంగకర్త శ్రీరాంభట్ల ముక్తేశ్వర సిద్ధాంతి జన్మస్థలం. వానమామలై వరదాచార్య వరంగల్ జిల్లా మడొకొండ వాస్తవ్యులైనప్పతికీ ఉద్యోగరీత్యా చెన్నూరులో స్థిరపడి సాహితీసేవ చేశారు. ఇతను అభినవ పోతనగా ప్రసిద్ధి చెందారు. రామన్న చెన్నూరు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, సర్పంచిగా పనిచేశారు. ఇతను నిజాం వ్యతిరేక పోరాటయోధుడు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Chennur Mandal, Mancherial Manchiryal Dist (district) Mandal in telugu, Mancherial Manchiryal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి