ఎర్రుపాలెం ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 31 గ్రామపంచాయతీలు, 24 రెవెన్యూ గ్రామాలు కలవు. ఖమ్మం జిల్లా తరఫున మంత్రిపదవిని నిర్వహించిన తొలి నాయకుడు శీలం సిద్ధారెడ్డి, తెలంగాణ సాయుధ పోరాటయోధుడు జమలాపురం కేశవరావు ఈ మండలానికి చెందినవారు. కట్టలేరు నదిపై కట్టలేరు ప్రాజెక్టు నిర్మించబడింది. వరంగల్-విజయవాడ సెక్షన్ రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నది. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో అతి దక్షిణాన ఆంధ్రప్రదేశ్ లోకి చొచ్చుకొనిపోయి ఉంది. పశ్చిమాన మధిర మండలం మినహా మిగితా మూడు వైపులా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దుగా ఉంది. మండలం మీదుగా కాజీపేట-విజయవాడ రైలుమార్గం వెళ్ళుచున్నది. చరిత్ర: నిజాం వ్యతిరేక ఉద్యమకాలంలో ఈ మండలం ప్రముఖ పాత్ర వహించింది. శీలం సిద్ధారెడ్డి వంటి ఉద్యమకారులు ఈ మండలంకు చెందినవారు. ఎర్రుపాలెం మండలం గోసవీడు క్యాం్‌లో ఉద్యమకారులకు శుక్షణ ఇచ్చేవారు. శీలం సిద్ధారెడ్డి ఈ క్యాంపు ఇంచార్జీగా నిజామ్ వ్యతిరేక పోరాటం సాగించారు. 1969లో తెలంగాణ ఉద్యమం ఈ మండలంలో ఉధృతంగా సాగింది. 2011లో 42 రోజుల పాటు సకలజనుల సమ్మె సంపుర్ణంగా కొనసాగింది. 2014లో ఈ మండలం తెలంగాణలో భాగమైంది.
జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 48253. ఇందులో పురుషులు 24518, మహిళలు
23735. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49854. ఇందులో పురుషులు 25090,
మహిళలు 24764.
రాజకీయాలు:
ఎర్రుపాలెం మండలం మధిర అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. రాజకీయ నాయకుడు, రాష్ట్రమంత్రిగా పనిచేసిన శీలం సిద్ధారెడ్డి ఈ మండలానికి చెందినవారు. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన దేవరకొండ శిరీష ఎన్నికయ్యారు.
ఎర్రుపాలెం మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు : Ayyavarigudem, Banigellapadu, Bheemavaram, Choppakatlapalem, Gatlagowraram, Gosaveedu, Guntupalligoparam, Inagali, Jamalapuram, Kacharam, Kesireddypalli, Mamnoor, Meenavolu, Mulugumadu, Peddagoparam, Pegallapadu, Rajupalem, Rangagudem, Remidicherla, Sakhinaveedu, Takkellapadu, Tatigudem, Tripuraram, Yerrupalem మండలంలోని పంచాయతీలు : అయ్యవారిగూడెం, బనిగండ్లపాడు, బంజర, భీమవరం, భీమవరం హరిజనవాడ, బుచ్చిరెడ్డిపాలెం, చొప్పకట్లపాలెం, గట్ల గౌరారం, గొసవీడు, గుంటుపల్లి గోపవరం, ఇనగలి, జమలాపురం, కాచారం, కండ్రిక, కొత్తపాలెం, లక్ష్మీపురం, మామునూరు, మీనవోలు, ములుగుమాడు, నరసింహపురం, పెద్ద గోపారం, పెగళ్ళపాడు, రాజులదేవరపాడు, రాజులపాలెం, రామాపురం, రేమిదిచెర్ల, సఖినవీడు, తెల్లపాలెం, తక్కెళ్ళపాడు, వెంకటాపురం, ఎర్రుపాలెం
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బనిగండ్లపాడు (Banigandlapad): బనిగండ్లపాడు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలమునకు చెందిన గ్రామము. ప్రముఖ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున తొలిసారిగా మంత్రిపదవిని నిర్వహించిన శీలం సిద్ధారెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. 1969లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయించారు. కళాశాల ప్రాంగణంలో సంజీవరెడ్డి ఆడిటోరియం ఉంది. బనిగండ్లపాడు, మీనవోలు గ్రామాల మధ్యన కట్టలేరు నదిపై కట్టలేరు ప్రాజెక్టు నిర్మించబడింది. ఎర్రుపాలెం (Errupalem):
ఎర్రుపాలెం ఖమ్మం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ప్రముఖ తెలంగాణ విమోచనొద్యమకారుడు జమలాపురం కేశవరావు ఈ గ్రామానికి చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Yerrupalem areni Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి