గజ్వేల్ సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. హైదరాబాదు నుంచి సిద్దిపేట వెళ్ళు రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 77511. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, xx గ్రామపంచాయతీలు, 27 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం గజ్వేల్ రెవెన్యూ డివిజన్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఆగస్టు 7, 2016 నాడు మిషన్ భగీరథ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడిచే ఈ మండలంలోని కోమటిబండ గ్రామంలో ప్రారంభించబడింది. సినీ దర్శకుడు బి.నర్సింగరావు ఈ మండలమునకు చెందినవారు. అక్టోబరు 11, 2016న ఈ మండలం మెదక్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన సిద్ధిపేట జిల్లాలోకి మారింది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన తొగుట మండలం, తూర్పున కొండపాక మండలం, ఆగ్నేయాన జగదేవ్‌పూర్ మండలం, దక్షిణాన మర్కూక్ మండలం, నైరుతిన వర్గల్ మండలం, పశ్చిమాన రాయిపోల్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 77511. ఇందులో పురుషులు 38738, మహిళలు 38773. అక్షరాస్యుల సంఖ్య 45201. పట్టణ జనాభా 24982, గ్రామీణ జనాభా 52529. రాజకీయాలు: ఈ మండలం గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ahmadipur, Akkaram, Arepally (Sivar Bejgaon), Bangla Venkatapur, Bayyaram, Bejgaon, Burugupally, Dacharam, Datharpally, Dharmareddipally, Dilalpur, Gajwel, Havaiguda (DP), Jaligaon, Kodakandla, Kolgur, Komatibanda, Kyasaram, Makta Masanpally, Mutrajpally, Pidched, Pragnapur, Rimmanguda, Sangapur, Seripally Makta, Singatam, Sirigiripally
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అక్కారం (Akkaram) :అక్కారం సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలమునకు చెందిన గ్రామము. అక్కారంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పంప్‌హౌస్ ఉంది. కోమటిబండ (Komatibanda): కోమటిబండ సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలమునకు చెందిన గ్రామము. ఆగస్టు 7, 2016 నాడూ మిషన్ భగీరథ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడిచే ఈ గ్రామంలో ప్రారంభించబడింది. ప్రజ్ఞాపూర్ (Pragnapur): ప్రజ్ఞాపూర్ మెదక్ జిల్లా గజ్వేల్ మండలమునకు చెందిన గ్రామము. సినీ దర్శకుడు బి.నర్సింగరావు స్వగ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే అభ్యసించారు. ప్రజ్ఞాపూర్ పరిసరాలలోనే 1979లో మాభూమి సినిమా చిత్రీకరించారు. ఇతను బీఎన్ రెడ్డి సినీ అవార్డు పొందారు. రిమ్మనగూడ (Rimmanaguda): రిమ్మనగూడ సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలమునకు చెందిన గ్రామము. మే 27, 2018నాడూ రిమ్మనగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Gajwel or Gajvel Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి