కోటగిరి విద్యాధరరావు
(1946-2013)
| |
జననం | ఏప్రిల్ 28, 1946 |
స్వస్థలం | తూర్పు యడవల్లి (పశ్చిమ గోదావరి జిల్లా) |
పదవులు | 5 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి |
నియోజకవర్గం | చింతలపూడి అ/ని, |
మరణం | జూలై 20, 2013 |
పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు యడవల్లిలో 1946లో జన్మించిన కోటగిరి విద్యాధరరావు సర్పంచిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యంలో చేరి 2009లో ఆ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో కాంగ్రెస్ సభ్యునిగా కొనసాగుతూ జూలై 20, 2013న మరణించారు.
కోటగిరి విద్యాధరరావు ఏప్రిల్ 28, 1946న పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుయడవల్లిలో జన్మించారు. బెంగుళూరులో బీటెక్ పూర్తిచేసి 1970లో స్వగ్రామం తూర్పుయడవెల్లి సర్పంచిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1983లో కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఆశించిననూ లభించకపోవడంతో ఇండిపెండెంటుగా పోటీచేసి చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 1985, 1989, 1994, 1999లలో చింతలపూడి నుంచే వరస విజయాలు సాధించారు. ఎన్టీరామారావు, చంద్రబాబునాయుడు మంత్రివర్గాలలో కూడా పనిచేశారు. 2004లో పరాజయం పొందారు. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కొనసాగారు. జూలై 20, 2013న ఆకస్మికంగా మరణించారు.

విభాగాలు: పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ నాయకులు, చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం, రాష్ట్ర మంత్రులు, 1946లో జన్మించినవారు, 2013లో మరణించినవారు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి