ప్రముఖ రచయిత, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ జూలై 5, 1927న కృష్ణా జిల్లా మోగులూరు గ్రామంలో జన్మించారు. వీరిది దేశభక్తుల కుటుంబం. తండ్రి స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. పేదరికంతో చినిగిన బట్టలు వేసుకున్నందుకు తరగతి గదిలో జరిగిన అవమానాల కారణంగా 8వ తరగతి అభ్యసిస్తున్నప్పుడు మధ్యలోనే చదుపు ఆపివేశారు. బతుకు పోరాటం కోసం కూలీగా పనిచేశారు. తిండి కోసం సైన్యంలో చేరారు. 1948లో వివాహం అనంతరం తెనాలిచేరి అక్కడ ఒక ప్రెస్సులో పనిచేశారు. కొన్నాళ్ళ తర్వాత ఒక పత్రికకు ఉపసంపాదకుడైనారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు ఒక కంపెనీలో సేల్స్‌మన్‌గా, ఆ తర్వాత హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో కళాకారునిగా చేరినారు.పేదరికం నుంచి జ్ఞానపీఠ్ అవార్డు వరకు అతను సాగించిన జీవన సమరం ఎన్నో మలుపులు తిరిగింది 2013, అక్టోబరు 18న రావూరి మరణించారు.
రచనా ప్రస్థానం: భరద్వాజ తన తొలి కథను 16 ఏళ్ల ప్రాయంలో వ్రాశారు. ఇది జానపద శైలిలోసాగే కథ. భరద్వాజపై చలం ప్రభావం అధికంగా ఉన్నది. చిన్నప్పుడు తాను పడ్డ కష్టాలు, బాధలు రావూరి రచనల్లో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ఆయన రచనలో సాహిత్యమే కాదు, సాంఘిక విలువలూ కనిపిస్తాయి. రావూరి భరద్వాజను నిలబెట్టే రచనల్లో అతి ముఖ్యమైనది పాకుడురాళ్లు నవల. భరద్వాజ దీనికి మాయ జలతారు అని నామకరణం చేశారు. అయితే శీలా వీర్రాజు పాకుడురాళ్లు అనే పేరు పెట్టారు. మూడు సంవత్సరాలపాటు కృష్ణా పత్రికలో ధారావాహికగా వెలువడిన పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగడం విశేషం. గుర్తింపులు: 1968 లో రావూరికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1983లో కేంద్ర సాగిత్య అకాడమీ ఆవార్డు లభించాయి. 1987లో సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు పొందారు. అదే ఏడాది రాజాలక్ష్మి పురస్కారం లభించింది. 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1987లో జవర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, 1991లో నాగార్జున విశ్వవిద్యాలయం రావూరికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసి గౌరవించాయి. 2012లో విశిష్టమైన జ్ఞానపీఠ అవార్డు పాకుడురాళ్ళు నవలకు గాను లభించింది. ఏప్రిల్ 17, 2013న ఈయనకు ప్రకటించబడ్డ జ్ఞాన్‌పీఠ్ అవార్డు తెలుగు సాహిత్యానికే గర్వకారణం. విశ్వనాథ సత్యనారాయణ, సి.నారాయణరెడ్డిల సరసన ఇతన్ని ఈ అవార్డు చేర్చిననూ రచనా ప్రపంచంలో ఇతని శైలి మాత్రం అంతకంటె గొప్పది.
= = = = =
|
5, జులై 2013, శుక్రవారం
రావూరి భరద్వాజ (Ravuri Bharadwaja)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి