బెజవాడ గోపాలరెడ్డి ఆగస్టు 7, 1907న నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించారు. స్వస్థలంలోనే హైస్కూలు విద్య పూర్తిచేసి బందరు జాతీయ కళాశాలలో చేరారు. 1927 లో శాంతినికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర విద్యను పూర్తి చేసారు. యుక్త వయస్సులోనే జాతీయోద్యమంలో చేరి జైలుకువెళ్ళారు. జాతీయోద్యమంలో ఉంటూనే సాహితీవేత్తగా పేరుపొందారు. యువదశలోనే రాజాజీ మంత్రివర్గంలో స్థానం పొందారు. 1955లో ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పొందారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన పిదప ఉప ముఖ్యమంత్రి లభించింది. ఆ తర్వాత నెహ్రూ మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. కామరాజ్ ప్రణాళిక ప్రకారం కేంద్రమంత్రివర్గం నుంచి వైదొలిగి ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నరుగా పనిచేశారు. మార్చి9, 1997న మరణించారు.
సాహితీవేత్తగా: జాతీయోద్యమంలో ఉన్నప్పుడే గోపాలరెడ్డి సాహితీవేత్తగా పేరుపొందారు. 1946 నుండి తెలుగుభాషా సమితి అధ్యక్షులుగా వ్యవహరించారు. 1957 నుండి 82 వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా పాతికేళ్ళు పనిచేశారు. 1963 నుండి ఎనిమిదేళ్ళు జ్ఞాన్‌పీఠ్ అధ్యక్షులుగా, 1978 నుండి కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యులుగా కొనసాగినారు. గోపాలరెడ్డి రవీంద్రుని గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. తొలుత అనువాదాలతో ప్రారంభించి డెబ్బయివ ఏట స్వతంత్ర రచనలు మొదలుపెట్టారు. 1978లో తొలి స్వీయ కవితాసంపుటి వెలువరించారు. కుటుంబం: గోపాలరెడ్డి తిక్కవరపు రామిరెడ్డి కుమార్తె లక్ష్మీకాంతమ్మను వివాహమాడారు. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
= = = = =
|
4, ఆగస్టు 2013, ఆదివారం
బెజవాడ గోపాలరెడ్డి (Bejawada Gopala Reddy)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
mee blog chala gundi pillalaku chala vupayoga paditundi nenu ma pillalaku chupi anduloni content nu chadivi quiz kuda conduct chestanu thank you thank u very much for pasidimogga entire team
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్య చాలా సంతోషానికి గురిచేసింది. ధన్యవాదాలు.
తొలగించండి