31, ఆగస్టు 2013, శనివారం

చెన్నమనేని రాజేశ్వరరావు (Ch. Rajeshwar Rao)

 చెన్నమనేని రాజేశ్వరరావు
జననంఆగస్టు 31, 1923
రంగంస్వాతంత్ర్యోద్యమం, రాజకీయాలు
పదవులు6 సార్లు ఎమ్మెల్యే
నియోజకవర్గంచొప్పదండి అ/ని, సిరిసిల్ల అ/ని,
చెన్నమనేని రాజేశ్వరరావు ఆగస్టు 31, 1923న కరీంనగర్ జిల్లా మాదిపాక గ్రామంలో జన్మించారు. తండ్రి శ్రీనివాసరావు, తల్లి స్వాతంత్ర్యసమరయోధురాలైన లలితాదేవి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బి పట్టా పొందిన రాజేశ్వరరావు 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలోనూ, 1947-48లో తెలంగాణ విమోచనొద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు. ఆగస్టు 15, 1947నాడు హైదరాబాదులో జాతీయజెండాను ఎగురవేశారు. హైదరాబాదు విమోచన అనంతరం సీపిఐ పార్టీలో చేరారు. 1952లో జైలులో ఉండుటచే పోటీచేయడానికి వీలుకాలేదు. 1957లో సీపీఐపై నిషేధం ఉండుటచే పీడీఎఫ్ తరఫున చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, ఆ తర్వాత మరో 5 సార్లు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2009లో ఆయన కుమారుడు చెన్నమనేని రమేష్ వేములవాడ నుంచి ఎన్నికయ్యారు.

రాజకీయ ప్రస్థానం:
హైదరాబాదు విమోచనోద్యమం సమయంలోనే కమ్యూనిస్టు పార్టీలో చేరిన రాజేశ్వరరావు 1952లో జైలులో ఉండుటచే పోటీచేయడానికి వీలుకాలేదు. 1957లో సీపిఐపై నిషేధం ఉండుటచే పీడీఎఫ్ తరఫున పోటీచేసి చొప్పదండి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 1967లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1972లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసింగ్ రావు చేతిలో ఓటమి చెందిననూ 1978లో మళ్ళీ సిరిసిల్ల నుంచి ఎన్నికై మూడోసారి శాసనసభలో ప్రవేశించారు. 1983లో తెలుగుదేశం పార్టీకి చెందిన మోహన్ రెడ్డి చేతిలో పరాజయం పొంది, 1985లో మళ్ళీ అదేస్థానంలో గెలుపొందారు. ఆ తర్వాత 1994లో విజయం సాధించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 1999లో తెదేపా తరఫున పోటీచేసి పాపారావు చేతిలో ఓడిపోయారు. 2004లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు విరమణ ప్రకటించి, 2009లో ఆయన కుమారుడు చెన్నమనేని రమేష్‌కు కొత్తగా ఏర్పాటైన వేములవాడ నుంచి టికెట్ ఇప్పించి గెలిపించారు.

బంధుత్వం:
ప్రముఖ ఆర్థికవేత్తగా పేరుపొందిన చెన్నమనేని హన్మంతరావు, కేంద్రమంత్రిగా పనిచేసిన చెన్నమనేని విద్యాసాగర్ రావులు రాజేశ్వరరావు సోదరులు.


విభాగాలు: కరీంనగర్ జిల్లా సమరయోధులు, కరీంనగర్ జిల్లా రాజకీయ నాయకులు, 1923లో జన్మించినవారు, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం, 2వ శాసనసభ సభ్యులు, 4వ శాసనసభ సభ్యులు, 6వ శాసనసభ సభ్యులు, 8వ శాసనసభ సభ్యులు, 10వ శాసనసభ సభ్యులు, 12వ శాసనసభ సభ్యులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక