జాతీయస్థాయి ఆర్థికవేత్తగా పేరుపొందిన చెన్నమనేని హనమంతరావు కరీంనగర్ జిల్లా కోనారావుపేట మండలం నాగారంలో 1929 మే 15న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందిన హన్మంతరావు విద్యార్థిదశలోనే ఉద్యమంలో పాల్గొన్నారు. ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్‌కు జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 1957లో రాజకీయాల నుంచి వైదొలిగి ఆర్థిక పరిశోధన రంగంలోకి వెళ్ళారు.
ఆర్థికరంగంలో ప్రస్థానం: హన్మంతరావు ఉస్మానియా విశ్వవిద్యాలయం 1961లో ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పొందారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఉద్యోగం పొంది 1966లో చికాగో విశ్వవిద్యాలయంలొ పోస్ట్ డాక్టోరల్ లో పీహెచ్‌డి కొరకు వెళ్ళారు. భారత్‌కు తిరిగి వచ్చిన పిదప 1976లొ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోట్‌కు డైరెక్టర్‌గా భాధ్యతలు స్వీకరించారు. 1981లో ఇందిరాగాంధీ ప్రభుత్వం నియమించిన ఆర్థిక పరిపాలన సంస్కరణల సంఘంలో సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత ప్రణాళిక సంఘం సభ్యుడిగా కొనసాగినారు. రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 20 సూత్రాల సలహా కమిటీ చైర్మెన్‌గా అవకాశం లభించింది. 1990లో జాతీయ శ్రామిక సంఘం చైర్మెన్‌గా నియమితులైనారు. ఆ తర్వాత సీఎస్‌ఎస్ సభ్యుడిగా, చైర్మెన్‌గా కొనసాగినారు. కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన ఎరువుల ధరల నియంత్రణ కమిటి చైర్మెన్‌గా పనిచేశారు. రిజర్వ్ బ్యాంక్ డైరెక్టరుగా, ఏడవ మరియు ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక సభ్యుడిగా పనిచేశారు, ఆర్థికరంగంలో చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ బిరుదు పొందారు. కుటుంబం: హన్మంతరావు తండ్రి శ్రీనివాసరావు. నలుగురు సోదరులలో హన్మంతరావు రెండోవారు. పెద్ద సొదరుడు చెన్నమనేని రాజేశ్వరరావు రాజకీయాలలో చేరి 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మరో సోదరుడు చెన్నమనేని విద్యాసాగర్ రావు భాజపాలో ప్రముఖ నేతగా పేరుపొంది కేంద్రమంత్రిగా పనిచేశారు. రాజేశ్వరరావు కుమారుడు చెన్నమనేని రమేష్ కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. హన్మంతరావు మేనమామ జోగినపలి ఆనందరావు సిరిసిల్ల తొలి ఎమ్మెల్యేగా పనిచేశారు. .
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
6, జనవరి 2014, సోమవారం
చెన్నమనేని హనమంతరావు (Chennamaneni Hanmanth Rao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి