పింగళి వెంకట్రాంరెడ్డి
| |
జననం | ఆగస్టు 22, 1869 |
పదవులు | హైదరాబాదు కొత్వాల్ |
బిరుగులు | రాజా బహద్దూర్, ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ |
మరణం | జనవరి 25, 1953 |
పింగళి వెంకట్రాంరెడ్డి ఆగస్టు 22, 1869న మహబూబ్‌నగర్ జిల్లా రాయనిపల్లిలో జన్మించారు. కొత్తకోట మండలం మిరాసిపల్లి (విలియంకొండ) స్వస్థలానికి చెందిన వెంకట్రాంరెడ్డి నిజాంల కాలంలో పోలీసు శాఖలో అమీన్ ఉద్యోగంలో ప్రవేశించి, అంచెలంచెలుగా ఎదిగి, హైదరాబాదు కొత్వాల్ (పోలీస్ కమీషనర్)గా పనిచేసి 1933లో పదవీ విరమణ పొందారు. నిజాంల కాలంలో ఈ పదవి పొందిన ఏకైక హిందూ కొత్వాలుగా ఈయనకు గుర్తింపు లభించింది. కొత్వాల్‌గా ఉన్నప్పుడే నగరంలో పలు ప్రజాసేవ కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. తర్వాత సమరయోధునిగా సహచరులకు స్పూర్తినిచ్చారు. 1946లో జరిగిన 26వ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ మహాసభకు ఈయన అధ్యక్షత వహించారు. జనవరి 25, 1953న వెంకట్రాంరెడ్డి మరణించారు.
సేవాకార్యక్రమాలు:
వెంకట్రాంరెడ్డి కొత్వాల్‌గా ఉన్నప్పుడు, తర్వాత కూడా అనేక ప్రజాసేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. తన స్వంత ఖర్చుతో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న రెడ్డి హాస్టల్ ఈయన స్థాపించినదే. సురవరం ప్రతాపరెడ్డి స్థాపించిన గోల్కొండ పత్రికకు కూడా ఈయన సహకరించారు. సురవరం రచించిన "హిందువుల పండుగులు" గ్రంథ రచనకు ఈయనే కారకుడు. నిజాం జన్మదినోత్సవం సందర్భంగా 1921లో ఈయనకు "రాజా బహద్దూర్" అనే బిరుదు లభించింది. బ్రిటిష్ ప్రభుత్వం 1931లో వీరికి "ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్" గౌరవం ప్రదానం చేసింది. ఈయన సేవలకు గుర్తింపుగా హైదరాబాదు విమోచన అనంతరం నారాయణగూడ కూడలిలో ఈయన విగ్రహం ఏర్పాటు చేయబడింది.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా ప్రముఖులు, కొత్తకోట మండలం , హైదరాబాదు, 1869లో జన్మించినవారు, 1953లో మరణించినవారు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి