పి.వి.రంగారావు
| |
జననం | |
స్వస్థలం | వంగర (కరీంనగర్ జిల్లా) |
పదవులు | 2 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, |
నియోజకవర్గం | హన్మకొండ అ/ని, |
మరణం | ఆగస్టు 1, 2013 |
పి.వి.రంగారావు ప్రధానమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు పెద్ద కుమారుడు. రంగారావు కూడా రాజకీయాలలో ప్రవేశించి 2 సార్లు హన్మకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1989లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హన్మకొండ నుంచి ఎన్నికకాగా, 1994లో ఓడిపోయారు, 1998 ఉప ఎన్నికలలో విజయం సాధించగా, 1999లో భాజపా అభ్యర్థి ఎం.ధర్మారావు చేతిలో పరాజయం పొందారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తెరాసతో పొత్తువల్ల రంగారావుకు పోటీచేసే అవకాశం రాలేదు. 2007లో ఎమ్మెల్సీగా నియమించబడ్డారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో రంగారావు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. రంగారావు సోదరుడు పి.వి.రాజేశ్వరరావు 1996లో సికింద్రాబాదు నుంచి లోకసభకు ఎన్నికైనారు. స్వగ్రామం వంగరలో బాలికల గురుకుల పాఠశాల నిర్మాణానికి 17 ఎకరాల స్వంతభూమి దానం చేశారు. 73 సంవత్సరాల వయస్సులో పి.వి.రంగారావు ఆగస్టు 1, 2013న మరణించారు. వంగరలోని గురుకుల విద్యాలయానికి పి.వి.రంగారావు పేరు పెట్టబడింది.
విభాగాలు: కరీంనగర్ జిల్లా రాజకీయ నాయకులు, భీమదేవరపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, హన్మకొండ అసెంబ్లీ నియోజకవర్గం, 2013లో మరణించినవారు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి