తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన ఆలె నరేంద్ర ఆగస్టు 21, 1946న హైదరాబాదులో జన్మించారు. బిఎస్సీ వరకు అభ్యసించి, రాజకీయాలలో ప్రవేశించి, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా ఎన్నికకావడమే కాకుండా కేంద్రమంత్రిగా కూడా పదవి పొందారు. ఏప్రిల్ 9, 2014న ఆలె నరేంద్ర మరణించారు.
రాజకీయ ప్రస్థానం: ఆలె నరేంద్ర తొలిసారి 1983లో హిమాయత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతాపార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. భాజపా నుంచి 3 సార్లు శాసనసభకు ఎన్నికై 1999లో కూడా భాజపా తరఫున మెదక్ లోకసభ నియోజకవర్గం నుంచి ఎంపిగా గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ సంఘర్షణ పార్టీ ఏర్పాటు చేసి భాజపా నుంచి బహిష్కృతులైనారు. ఆ తర్వాత తెరాసలో చేరి 2004లో తెరాస తరఫున మెదక్ నుంచి లోకసభకు విజయం సాధించారు. కేంద్రంలో కొంతకాలం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కెసీఆర్‌తో వివాదాల వల్ల తెరాస నుంచి బహిష్కృతుడై తెరాస(ఎన్) స్థాపించారు. అణుఒప్పందం బిల్లు సమయంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటువేసి ఆ పార్టీకి దగ్గరయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్ళీ భాజపాలో ప్రవేశించారు. కుటుంబం: నరేంద్ర భార్య పేరు ఏ.లలిత. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. కుమారుడు గ్రేటర్ హైదరాబాదు కార్పోరేషన్ డివిజన్ సభ్యుడు (కార్పోరేటర్).
|
31, జులై 2013, బుధవారం
ఆలె నరేంద్ర (Aelay Narendra)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి