15, జూన్ 2013, శనివారం

నిజామాబాదు లోకసభ నియోజకవర్గం (Nizamabad Loksabha Constituency)

నిజామాబాదు లోకసభ నియోజకవర్గం
జిల్లాఉమ్మడి నిజామాబాదు, కరీంనగర్
ప్రస్తుత ఎంపిధర్మపురి అరవింద్
పార్టీభారతీయ జనతా పార్టీ


తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో నిజామాబాదు మరియు కరీంనగర్ జిల్లాలకు చెందిన 7 అసెంబ్లీ నియోజక వర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. తొలి 3 ఎన్నికలలో ఇక్కడి నుంచి ప్రముఖ విమోచనోద్యమ నాయకుడు హరీష్ చంద్ర హెడా ఎన్నికయ్యారు. 2019లో భాజపాకు చెందిన ధర్మపురి అరవింద్ విజయం సాధించారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1వ 1952-57 హెచ్.సి.హెడా కాంగ్రెస్ పార్టీ
2వ 1957-62 హెచ్.సి.హెడా కాంగ్రెస్ పార్టీ
3వ 1962-67 హెచ్.సి. హెడా కాంగ్రెస్ పార్టీ
4వ 1967-71 ఎం.నారాయణరెడ్డి ఇండిపెండెంట్
5వ 1971-77 ఎం.రామగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
6వ 1977-80 ఎం.రామగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 ఎం.రామగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 తాడూరి బాలాగౌడ్ కాంగ్రెస్ పార్టీ
9వ 1989-91 తాడూరి బాలాగౌడ్ కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 గడ్డం గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ
11వ 1996-98 గడ్డం ఆత్మచరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
12వ 1998-99 గడ్డం గంగారెడ్డి తెలుగుదేశం పార్టీ
13వ 1999-04 గడ్డం గంగారెడ్డి తెలుగుదేశం పార్టీ
14వ 2004-09 మధుయాస్కీ గౌడ్ కాంగ్రెస్ పార్టీ
15వ 2009-14 మధుయాస్కీ గౌడ్ కాంగ్రెస్ పార్టీ
16వ 2014-19 కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సమితి
17వ 2019- ధర్మపురి అరవింద్ భాజపా


2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ అయిన మధుయాస్కీ గౌడ్ తన సమీప ప్రత్యర్థి మహాకూటమి తరఫున పోటీచేసిన తెరాస అభ్యర్థి పి.గణేష్ గుప్తాపై 60,390 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మధుయాస్కీకి 296504 ఓట్లు రాగా, గణేష్‌కు 236114 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వినయ్ కుమార్ 3వ స్థానంలో, భాజపా అభ్యర్థి బాపురెడ్డి 4వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 39 అభ్యర్థులు నామినేషన్ వేయగా 14 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. 9 గురు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. తుదిబరిలో 16 అభ్యర్థులు మిగిలారు. తెరాస అభ్యర్థి కవిత తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎంపి అయిన మధుయాస్కీగౌడ్‌పై 163893 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019లో జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికలలో ఇక్కడి నుంచి భారతీయ జనతాపార్టీకి చెందిన ధర్మపురి అరవింద్ తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన సిటింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై 71057 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అరవింద్‌కు 480004 ఓట్లు రాగా, కవితకు 406947 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మధియాస్కీ గౌడ్ 69,240 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ స్థానం నుంచి భాజపా విజయం సాధించడం ఇది తొలిసారి.


హోం,
విభాగాలు: నిజామాబాదు లోకసభ నియోజకవర్గం, తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాలు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక