అంతర్జాతీయ వార్తలు 2014 (International News 2014)
జనవరి 2014:
- 2014, జనవరి 1: రష్యాలోని నొవాస్‌బిరిస్క్ ప్రాంతంలో 3500 ఏళ్ల క్రితం నాటి అస్థిపంజరాలు త్రవ్వకాలలో లభించాయి.
- 2014, జనవరి 3: మడగాస్కర్ అధ్యక్ష ఎన్నికల్లో హేరి రాజోనారిమామ్‌పియానినా విజయం సాధించారు.
- 2014, జనవరి 5: బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరిగాయి.
- 2014, జనవరి 11: ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి ఎరియల్ షెరాన్ మరణించారు.
- 2014, జనవరి 12: బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా మూడవసారి ప్రమాణస్వీకారం చేసింది.
- 2014, జనవరి 27: గ్రామీ అవార్డులలో డాప్ట్‌పంక్‌గా పేరుపొందిన సంగీతజోడికి 5 అవార్డులు లభించాయి.
ఫిబ్రవరి 2014:
- 2014, ఫిబ్రవరి 2: ఇండోనేషియాలోని పశ్చిమ సుమత్ర దీవులలో ఉన్న సినాబంగ్ అగ్నిపర్వతం పేలి 16 మంది మరణించారు.
- 2014, ఫిబ్రవరి 4: భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ పదవి లభించింది.
- 2014, ఫిబ్రవరి 10: నేపాల్ ప్రధానమంత్రిగా సుశీల్ కొయిరాలా ఎన్నికయ్యారు.
- 2014, ఫిబ్రవరి 11: అల్జీరియాలో సైనిక విమానం కూలి 103 మంది మరణించారు.
- 2014, ఫిబ్రవరి 20: ప్రముఖ మొబైల్ మెసేజింగ్ సర్వీస్ వాట్స్‌యాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది.
- 2014, ఫిబ్రవరి 22: ఇటలీ ప్రధానమంత్రిగా మెటెయో రెంజీ పదవిబాధ్యతలు స్వీకరించారు.
మార్చి 2014:
- 2014, మార్చి 1: ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్‌ను బ్రిటన్ కు చెందిన హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ లిమిటెడ్ సంస్థ ఆవిష్కరించింది.
- 2014, మార్చి 2: ప్రపంచంలోని కుబేరుల్లో బిల్ గేట్స్ అగ్రస్థానంలో నిలిచారు.
- 2014, మార్చి 3: ఉక్రేయిన్‌లోని క్రిమియా సమీపంలోని నౌకాస్థావరాన్ని రష్యా ఆక్రమించింది.
- 2014,మార్చి 3:లాస్‌ఏంజిల్స్‌లో 2013 సంవత్సరపు ఆస్కార్ అవార్డులు ప్రకటించబడ్డాయి. (2013 ఆస్కార్ అవార్డుల జనరల్ నాలెడ్జి ప్రశ్నల కోసం ఇక్కడ చూడండి)
- 2014, మార్చి 9: కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్ళాల్సిన మలేషియా విమానం అదృశ్యమైంది.
- 2014, మార్చి 9: యేల్ విశ్వవిద్యాలయ సాహిత్య పురస్కారం పంకజ్ మిశ్రాకు లభించింది.
- 2014, మార్చి 17: క్రిమియా స్వతంత్ర్య దేశంగా ప్రకటించుకుంది.
ఏప్రిల్ 2014:
-
2014, ఏప్రిల్ 2: చిలీలో భారీ భూకంపం సంభవించింది.
- 2014, ఏప్రిల్ 3: పాకిస్తాన్ మాజీ పాలకుడు ముషారఫ్ బాంబుదాడి నుంచి తప్పించుకున్నారు.
- 2014, ఏప్రిల్ 7: లఫ్జరీ (ఫ్రాన్స్), హోల్సిం (స్విట్జర్లాండ్) సిమెంటు కంపెనీలు ఏకమై "లఫ్జరీహోల్సిం" పేరిటప్రపంచంలోనే అతిపెద్ద సిమెంటు కంపెనీగా అవతరించింది.
- 2014, ఏప్రిల్ 10: చైనాలో అత్యంత ప్రభావవంతమైన బోవో ఫోరం ఫర్ ఆసియా బోర్డులో భారత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు సభ్యత్వం లభించింది.
- 2014, ఏప్రిల్ 15: భారత సంతతికి చెందిన అమెరికన్ కవి విజయ్ శేషాద్రి పులిట్జర్ బహుమతికై ఎంపికయ్యారు.
- 2014, ఏప్రిల్ 15: బ్రిటన్‌లో అత్యంత సంపన్న ఆసియా కంపెనీగా హిందూజా గ్రూపు తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
- 2014, ఏప్రిల్ 16: దక్షిణ కొరియాలో 459 ప్రయాణీకులు ప్రయాణిస్తున్న ఓడ మునిగిపోయింది.
- 2014, ఏప్రిల్ 20: ప్రముఖ ఔషధ కంపెనీ ర్యాన్‌బాక్సీని సన్ ఫార్మాస్యూటికల్స్ విలీనం చేసుకుంది.
- 2014, ఏప్రిల్ 22: మిరప మెక్సిలో పుటిందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశొధకులు కనుగొన్నారు.
- 2014, ఏప్రిల్ 26: న్యూయార్క్‌లో ప్రపంచ హిందీ మహాసభలు ప్రారంభమయ్యాయి.
- 2014, ఏప్రిల్ 27: ప్రపంచంలోనే అతిపెద్ద వృద్ధుడు ఇటలీకి చెందిన అర్టురో లికాటా మరణించాడు.
మే 2014:
- 2014, మే 1:ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో హైస్పీడ్ రైలు సొరంగాన్ని చైనా ప్రారంభించింది.
- 2014, మే 1: నోకియా కంపెనీ సీఈఓగా భారత్‌కు చెందిన రాజీవ్ సూరీ నియమితులైనారు.
- 2014, మే 2: ప్రపంచ సెక్సీయెస్ట్ మహిళగా జెన్నిఫర్ లారెన్స్ ఎంపికైంది.
- 2014, మే 3: అఫ్ఘనిస్తాన్‌లో కొండచరియలు విరిగిపడి 2000లకు పైగా ప్రజలు మరణించారు.
- 2014, మే 4: లిబియా ప్రధానమంత్రిగా అహ్మద్ మతిక్ పదవి చేపట్టారు.
- 2014, మే 10: దక్షిణాఫ్రికా ఎన్నికలలో ఆఫ్హ్రికన్ నేషనల్ కాంగ్రెస్ విజయం సాధించింది.
- 2014, మే 20: థాయిలాండ్‌లో సైనిక శాసనం విధించబడింది.
- 2014, మే 27: 560 కిలోల బరువుతో ప్రపంచంలోనే స్థూలకాయుడిగా గిన్నిస్ రికార్డులో స్థానం పొందిన మాన్యేల్ యురిబ్ (మెక్సికో) మరణించాడు.
జూన్ 2014:
- 2014, జూన్ 1: లండన్ బరో ఆఫ్ సౌత్ వార్క్ మేయర్‌గా ప్రవాస భారతీయుడు సునీల్ చోప్రా ఎన్నికయ్యారు.
- 2014, జూన్ 9: కరాచి విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడిచేశారు.
- 2014, జూన్ 16: ఇరాక్‌లో అంతర్యుద్ధం మొదలైంది.
- 2014, జూన్ 16: భారత ప్రధాని నరేంద్రమోడి భూటాన్ పర్యటించి థింపూలో ఖొలాంగ్సు జలవిద్యుత్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.
- 2014, జూన్ 18: ఆసియా నోబెల్ ఫైజ్‌గా పరిగణించబడే "తాంగ్ ప్రైజ్" నార్వే మాజీ ప్రధానమంత్రి గ్రోహార్మెమ్ బ్రంట్‌లాండ్‌కు లభించింది.
- 2014, జూన్ 26: యెమెన్ విమానాశ్రయంపై మిలిటెంట్లు దాడిచేశారు.
- 2014, జూన్ 28: నమీబియాలో 54 కోట్ల సంవత్సరాల క్రితం నాటి పగడపు దిబ్బ లభించింది.
జూలై 2014:
- 2014, జూలై 13: దక్షిణాఫ్రికాకు చెందిన సాహిత్య నోబెల్ బహుమతి గ్రహీత నాడినె గార్డెమెర్ మరణించారు.
- 2014, జూలై 15: సిరియా అధ్యక్షుడిగా బషీర్ అల్ అస్సాద్ వరసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించారు.
- 2014, జూలై 17: ఉక్రేయిన్-రష్యా సరిహద్దులో మలేషియాకు చెందిన బోయింగ్-777 విమానం కూలి 295 మంది మరణించారు.
- 2014, జూలై 18: సిరియాలో ఇస్లామిక్ తీవ్రవాదులతో జరిగిన పోరులో 100 మంది సైనికులు మరణించారు.
- 2014, జూలై 22: వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో భూమిలాంటి గ్రహాన్ని (కెప్లర్-421బి) ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
- 2014, జూలై 24: దక్షిణ కొరియాలోని బుసాన్ నగరంలో మహాత్మాగాంధీ విగ్రహం ఆవిష్కరించబడింది.
- 2014, జూలై 24: తైవాన్‌లో విమానం కూలి 51 మంది మరణించారు.
- 2014, జూలై 24: అల్జీరియాకు చెందిన విమానం కూలి 54 మంది మరణించారు.
- 2014, జూలై 28: ఫిలిప్పీన్స్ జనాభా 100 మిలియన్లు దాటింది.
ఆగస్టు 2014:
- 2014, ఆగస్టు 4: చైనాలో యున్నాన్ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించి 400 మంది మరణించారు.
- 2014, ఆగస్టు 10: టెహరాన్ వద్ద విమానం కూలి 50 మంది మరణించారు.
- 2014, ఆగస్టు 13: ఫీల్డ్స్ మెడల్ పొందిన తొలి మహిళగా మరియం మిర్‌జఫానీ అవతరించింది.
- 2014, ఆగస్టు 14: పిట్స్‌బర్గ్ శాస్త్రవేత్తలు లోహపు గాజును తయారుచేశారు.
- 2014, ఆగస్టు 15: పాకిస్తాన్‌లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్‌పై హత్యాయత్నం జరిగింది.
- 2014, ఆగస్టు 20: ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా జపాన్‌కు చెందిన సకారీ మొమోయి (111 ఏళ్ళు) గిన్నిస్‌బుక్‌లో నమోదయ్యారు.
- 2014, ఆగస్టు 24: ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు రిచర్డ్ అటెన్‌బరో మరణించారు.
సెప్టెంబరు 2014:
- 2014, సెప్టెంబరు 7: అంతర్జాతీయ విజ్ఞానశాస్త్ర మండలి అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి దయారెడ్డి ఎన్నికయ్యారు.
- 2014, సెప్టెంబరు 9: భారతీయ సంతతికి చెందిన రచయిత నీల్ ముఖర్జీ రచించిన "ది లైవ్స్ ఆఫ్ అదర్స్: నవల మ్య్న్ బుకర్ బహుమతి (2014) తుది జాబితాలో చేరింది.
- 2014, సెప్టెంబరు 11: జేమ్స్ బాండ్ విలన్ రిచర్డ్ కైల్ మరణించాడు.
- 2014, సెప్టెంబరు 19: స్కాట్లాండ్‌లో ప్రజాభిప్రాయ సేకరణలో బ్రిటన్‌తో కలిసి ఉండేందుకు ప్రజలు మద్దతు పలికారు.
- 2014, సెప్టెంబరు 21: అఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా అష్రఫ్ అహ్మద్ జైన్ ఎన్నికయ్యారు.
- 2014, సెప్టెంబరు 25: ప్రపంచంలో ఖరీదైన నగరంగా లండన్ నిలిచింది.
- 2014, సెప్టెంబరు 30: ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ ఆర్కుట్ మూతపడింది.
అక్టోబరు 2014:
- 2014, అక్టోబరు 1: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం విడుదల చేసింది.
- 2014, అక్టోబరు 1: ప్రపంచంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రారంభమై 50 పూర్తయింది. (1964 అక్టోబరు 1న జపాన్‌లో ప్రారంభమైంది).
- 2014, అక్టోబరు 6: వైద్యశాస్త్రంలో 2014 సం.పు నోబెల్ బహుమతిని జాన్ ఒ కీఫే (బ్రిటన్-అమెరికన్), ఎడ్వర్డ్ మోసర్ (నార్వే), మేబిట్ మోసర్ (నార్వే)లకు లభించింది.
- 2014, అక్టోబరు 7: ఇసాము అకసాకి (జపాన్), హిరోషి అమానో (జపాన్), ఘజి నకమురా (జపాన్‌లో పుట్టిపెరిగి అమెరికాలో స్థిరపడ్డారు) లకు 2014 సంవత్సరానికి భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతులు ప్రకటించారు.
- 2014, అక్టోబరు 8: రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి ఎరిక్ బెట్‌జిగ్ (అమెరికా), విలియం మోర్నర్ (అమెరికా), స్టోఫెన్ హెల్ (జర్మనీ)లకు ప్రకటించారు.
- 2014, అక్టోబరు 10: ఓ ఏడాది నోబెల్ శాంతిబహుమతి కైలాస్ సత్యర్థి (భారత్), మలాలా యూసుఫ్ జాయ్ (పాకిస్తాన్)లకు ప్రకటించారు.
- 2014, అక్టోబరు 13: 2014 సంవత్సరపు ఆర్థికశాస్త్ర నోబెల్ బహుమతి ఫ్రాన్సుకు చెందిన జీన్ టిరోల్‌కు లభించింది.
- 2014, అక్టోబరు 15: ఈ ఏడాది మ్యాన్ బుకర్ బహుమతి ఆస్ట్రేలియాకు చెందిన రిచర్డ్ ఫ్లానగాన్‌కు లభించింది.
- 2014, అక్టోబరు 17: ఈ సంవత్సరపు ప్రపంచ ఆహార పురస్కారం భారత్‌లో జన్మించిన మెక్సికో శాస్త్రవేత్త సంజయ్ రాజారాంకు ప్రకటించారు.
- 2014, అక్టోబరు 18: ఇరాక్‌లో కారుబాంబు పేలి 23 మంది మరణించారు.
- 2014, అక్టోబరు 21: ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి గాఫ్ వైట్ లామ్ మరణించారు.
- 2014, అక్టోబరు 22: అఈతలోలోని ఒక ల్యాబ్‌లో శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత (-273.144)ను సృష్టించి రికార్డు నెలకొల్పారు.
- 2014, అక్టోబరు 22: అట్టావాలో పార్లమెంటు ఆవరణలో కాల్పులు జరిగాయి.
- 2014, అక్టోబరు 26: బ్రెజిల్‌లో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి.
- 2014, అక్టోబరు 30: శ్రీలంకలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 200 మంది సజీవసమాధి అయ్యారు.
నవంబరు 2014:
- 2014, నవంబరు 2: పాకిస్తాన్‌లోని వాఘా వద్ద బాంబుపేలుడులో 55 మంది మరణించారు.
- 2014, నవంబరు 5: అమెరికన్ సెనేట్ ఎన్నికలలో రిపబ్లిక పార్టీ మంచి ఫలితాలు సాధించింది.
- 2014, నవంబరు 8: ఉక్రేయిన పార్లమెంటు ఎన్నికలలో అధికార పీపుల్స్ ఫ్రంట్ విజయం సాధించింది.
- 2014, నవంబరు 15: బ్రిస్బేన్‌లో జి-20 సదస్సు ప్రారంభమైంది.
- 2014, నవంబరు 25: అఫ్ఘనిస్తాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 52 మంది మరణించారు.
- 2014, నవంబరు 26: 18వ సార్క్ సదస్సు ఖాట్మండులో ప్రారంభమైంది.
- 2014, నవంబరు 26: పాకిస్తాన్ నటి వీణామాలిక్‌కు 26 సంవత్సరాల జైలుశిక్ష విధించబడింది.
- 2014, నవంబరు 29: మిస్ ఎర్త్‌గా పిలిప్పీన్స్‌కు చెందిన జమీ హెరెల్ ఎన్నికైంది.
డిసెంబరు 2014:
- 2014, డిసెంబరు 3: జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ హయబుస-2ను విజయవంతంగా ప్రయోగించింది.
- 2014, డిసెంబరు 7: ఎర్రసముద్రంలో పడవ మునిగి 70 మంది మరణించారు.
- 2014, డిసెంబరు 10: భారత్‌లో అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన రిచర్డ్ రాహుల్ వర్మ ఎంపికైనారు.
- 2014, డిసెంబరు 10: టైం పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా ఎబోలా ఫైటర్స్ ఎంపికైంది.
- 2014, డిసెంబరు 11: ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగాదినంగా ప్రకటించింది.
- 2014, డిసెంబరు 11: చైనా శాంతి బహుమతి క్యూబా కమ్యూనిస్టు నాయకుడైన ఫిడేల్ కాస్ట్రోకు ప్రకటించబడింది.
- 2014, డిసెంబరు 14: జపాన్ పార్లమెంటు ఎన్నికలలో ప్రస్తుత ప్రధానమంత్రి షింబో అజే నేతృత్వంలోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ విజయం సాధించింది.
- 2014, డిసెంబరు 14: ప్రపంచ సుందరి కిరీటం దక్షిణాఫ్రికాకు చెందిన రోలీన్ స్ట్రాస్‌కు దక్కింది. రెండోస్థానంలో ఎడినా కుల్క్‌సార్ (హంగేరి), మూడోస్థానంలో ఎలిజబెత్ సాఫ్రిత్ (అమెరికా) నిలిచారు.
- 2014, డిసెంబరు 16: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో తాలిబన్ల నరమేధంలో 141 మంది మరణించారు.
- 2014, డిసెంబరు 28: ఇండోనేషియాకు చెందిన ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలి 155 మంది మరణించారు.
ఇవి కూడా చూడండి: అంతర్జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2008, 2010, 2011, 2012, 2013, 2015, |
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి